దేశంలో  ఇప్పుడు కరోనా కష్టాలు చాలా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో చాల మంది ఉద్యోగాలు కోల్పోయి నానా కష్టాలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా సరే సాధారణ పరిస్థితి ఇప్పట్లో వచ్చే అవకాశం మాత్రం  కనపడటం లేదు. మన దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే  నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. దీనితో ఎన్నారైలు మన దేశంలో నిరుద్యోగులు  తమ వంతుగా కృషి చేస్తున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు.

ఉద్యోగాలు కల్పించడానికి రెడీ అవుతున్నారు. ఇందుకోసం కొన్ని ఎన్నారై తెలుగు సహా ఇతర భాషల సంస్థలు తీవ్రంగా కష్టపడుతున్నాయి.  దేశంలో ఇప్పుడు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాయి. వేలాది మంది ఎన్నారైలు కంపెనీలు స్థాపించే అడుగులు వేస్తున్నారు అని తెలుస్తుంది. కొంత మంది టీమ్స్ గా ఏర్పడి కంపెనీల స్థాపన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిభ ఉన్న నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కోసం కొందరు ఎదురు చూస్తున్నారు. ఐటి రంగం తో పాటుగా పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తున్నారు.

అంతే కాకుండా ఉపాధి అవకాశాలను సృష్టించే క్రమంలో కీలక అడుగులు వేస్తున్నారు. వినూత్న వ్యవసాయ పద్ధతులకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కూడా చిన్నా పెద్దా కంపెనీలను స్థాపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఉన్న ఎన్నారై లు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అడుగు పడవచ్చు. ఇటీవల  ఒక ఎన్నారై సంస్థ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపింది అని అంటున్నారు. త్వరలోనే తానా సహా నాట్స్ వంటి సంస్థలు కూడా ఈ ప్రయత్నాలు చేయడానికి రెడీ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: