మన దేశ ఆర్ధిక వ్యవస్థలో ఇప్పుడు చిన్నా చితకా కంపెనీలు అనేవి చాలా కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశ ఆర్ధిక వ్యవస్థను దాదాపుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంతే కాకుండా ఎంతో మందికి ఉపాధి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే చిన్న చిన్న కంపెనీల విషయంలో చాలా వరకు కూడా ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి అనే సంగతి తెలిసిందే. ఇక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చిన్న చిన్న కంపెనీల విషయంలో చాలా శ్రద్ధ చూపించే పరిస్థితి ఉంది అనే చెప్పాలి.

ఏపీలో సిఎం వైఎస్ జగన్ అయితే వారి కోసం ప్రత్యేకంగా కొన్ని నిధులను కూడా ప్రకటించారు. ఆర్ధిక కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే విధంగా ఆయన ఒక ప్రణాళిక కూడా సిద్దం చేసి దాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. ఏపీలో ఎన్నారై లు ఎవరు అయినా సరే వ్యాపారాలు చేయాలి అనుకుంటే వారికీ అన్ని విధాలుగా రాయితీలు ప్రకటించే విధంగా సిఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు. రాయితీలు ప్రకటించడం ద్వారా ఆర్ధికంగా వారికి వెసులుబాటు కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

త్వరలోనే ఒక పరిశ్రమల శాఖ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుని కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. వ్యాపారవేత్తలతో సమావేశం నిర్వహించి  పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి దీనిపై ముందు అడుగు వేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ విషయంలో ఎలాంటి ముందు అడుగు పడుతుంది అనేది త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ఎన్నారైలు ఇప్పుడు ఏపీలోనే కాదు దేశంలో అన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు చేసే ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: