మన దేశంలో వ్యాపారాల విషయంలో చైనా చాలా వరకు కూడా సీరియస్ గా ఉంటుంది. వ్యాపారాలను చేయడానికి చైనా  మన దేశాన్ని ఎక్కువగా అనువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే  గత కొన్ని రోజుల నుంచి మాత్రం మన దేశంలో చైనా వ్యాపారాలు ఎక్కువగా నష్టపోతున్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. మన దేశంలో చాలా వరకు కూడా చైనా చేసే వ్యాపారాలు ఇప్పుడు ఆగిపోయిన పరిస్థితి ఉంది. లడఖ్ లో సైనికుల ఘర్షణ తర్వాత చైనా అంటేనే  మన వాళ్ళు ఆగ్రహంగా ఉండే పరిస్థితి అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే... మన దేశానికి చెందిన వారు కొందరు చైనాలో వ్యాపారాలు చేస్తున్నారు. వారు ఇండియాకు డీలర్లు గా కూడా చేస్తున్నారు. అయితే ఇండియాలో వ్యాపారాలు పోవడంతో మన  డీలర్లను అక్కడ చైనా ఇబ్బందులకు గురి చేస్తుంది అని తెలుస్తుంది. ప్రతీ విషయంలో కూడా ఎన్నారైలను టార్గెట్ చేస్తుంది అని అంటున్నారు. వారికి ఇచ్చే షేర్ లో కూడా ఇప్పుడు చైనా బాగా తగ్గించింది. దీనితో ఎన్నారైలు బాగా ఇబ్బంది పడుతున్నారు.

చైనాలో ఉన్న ఎన్నారైలలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు కూడా బాగా పడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. చైనా వైఖరితో చాలా మంది ఇండియాకు వచ్చేయాలి అని చూస్తున్నారు. చిన్న చిన్న వస్తువులను తయారు చేసే  కంపెనీలు మన వారిని  పక్కన పెట్టాయి అని అంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా కొనసాగితే మాత్రం మన వారు చాలా ఇబ్బందులు పడవచ్చు అంటున్నారు. అక్కడ చాలా మంది స్థిరపడి ఆస్తులు కూడా పెంచుకున్నారు. ఈ తరుణంలో ఇలా చైనా ఇబ్బంది పెడితే ఎలా అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: