అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపధ్యంలో మన దేశం వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారు ఏంటీ అనేది ఇంకా ఎలాంటి స్పష్టతా లేదు. మరో మూడు రోజుల్లో అమెరికా ఎన్నికలు ఉన్న నేపధ్యంలో చాలా వరకు కూడా ఇప్పుడు ట్రంప్ మన వారి మీద ఆశలు పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే ట్రంప్ ని మన వాళ్ళు అసలు నమ్మడం లేదని అంటున్నారు. ప్రధానంగా విద్యార్ధుల తల్లి తండ్రులు అయితే అసలు నమ్మడం లేదని అంటున్నారు.  రేపు ఇక్కడ ఉన్నత చదువులు చదివినా ట్రంప్ అధ్యక్షుడు అయితే ఇతర దేశాల వారికి ఉద్యోగాలు రావు ఏమో అనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఇప్పుడు ఎక్కువగా సొంత వారికీ మాత్రమే ట్రంప్ మద్దతు ఇస్తున్నారు. రాబోయే నాలుగేళ్లలో ఆయన ఏదైనా నిర్ణయాలు తీసుకుని దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంది. ట్రంప్ మంచి వాడు అనే అభిప్రాయం అమెరికా ప్రజలకు రావడానికి అమెరికా ప్రజల కోసం తాను ఎంతో చేసాను అని చెప్పడానికి రేపు తన కుమార్తెని ఎన్నికలలో మళ్ళీ నిలబెట్టడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. లేదా అల్లుడు భార్యలో ఒకరిని వచ్చే ఎన్నికల్లో ఆయన నిలబెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నారైలకు కూడా కాస్త భయం అనేది ఉంది.

చాలా మంది ఎన్నారై లు ట్రంప్ ని అసలు నమ్మకుండా ఉండటమే మంచిది అనే భావనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జో బిడెన్ కూడా అలాగే ఉన్నారు. ఇక దేశంలో ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్ల కోసం కొత్త పాలసీ కూడా ట్రంప్ గెలిచిన తర్వాత తీసుకొచ్చే అవకాశం ఉండవచ్చు అని అంటున్నారు. మరి ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటీ అనేది చూడాలి. అందుకే ఎన్నారైలు ఆయనను నమ్మడం లేదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: