భారత్ తో  ఇప్పుడు అమెరికాకు సంబంధాలు అనేవి చాలా కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . భారత్ తో ఇప్పుడు అమెరికా కరోనా వ్యాక్సిన్ తయారి విషయంలో ఎక్కువగా ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో ఉన్న ఫార్మా కంపెనీలకు కాస్త ఎక్కువగా తయారి శక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు మన దేశంతో స్నేహం చేయడానికి అమెరికా ఆసక్తి చూపిస్తుంది. చైనాలో ఉన్నా సరే అక్కడ ఇప్పుడు అమెరికాక్కు అనుకూలంగా వాతావరణం లేదు అనే సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని ఆసక్తికరంగా మారాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... తర్వాత బాధ్యతలు చేపట్టే బిడెన్ తన కేబినేట్ లో భారత్ తో మంచి సంబంధాలు ఉండే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఒబామా హయాంలో సమర్ధవంతంగా పని చేసిన వారి మీద ఆయన దృష్టి సారించి మళ్ళీ వారికి బాధ్యతలు ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.  బిడెన్ ఇప్పటికే కమలా హారిస్ ని  ఉపాధ్యక్షురాలి గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కేబినేట్ లో నలుగురు మంత్రులను భారతీయులను  నియమించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు భారత్ తో మంచి సంబందాలు కావాలి అనుకుంటే కచ్చితంగా భారత్ తో అనుకూలంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అందుకే ఇప్పుడు బిడెన్ కాస్త జాగ్రత్త పడుతున్నారు. ఆయన కేబినేట్ కి సంబంధించి ఇప్పుడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నారై లు ఆయనకు అండగా నిలిచారు అనే భావన చాలా మందిలో ఉంది. ఇక ఎన్నారై ని తన ప్రభుత్వంలో మంత్రిని చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇక ఆయన ఒబామా సలహాలు కూడా కాస్త ఎక్కువగానే తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: