భారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల మధ్య చాలా కీలక ఒప్పందాలు ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా సామాజికంగా కూడా రెండు దేశాల మధ్య స్నేహం అనేది చాలా కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత అభివృద్దిలో అమెరికా పాత్ర ఎంత ఉందో అమెరికా అభివ్రుద్దిలో భారత్  పాత్ర అంతకు మించి ఉంది. అమెరికా ఐటి రంగం మొత్తం కూడా మన మీదనే ఆధారపడి ఉంది. అగ్ర సంస్థలు అన్నీ కూడా మన మీదనే ఆధారపడి ఉన్నాయి అనే చెప్పాలి.

చాలా వరకు కీలక సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు మన వారి మీదనే ఆధారపడి ఉన్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వాలు కూడా మన వారి విషయంలో ఎక్కడా వివాదాస్పదంగా ఉండేవి కాదు. కాని ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రం సినిమా మారింది. మన వారిని ఆయన ఇబ్బంది పెట్టాడు. అయితే ఇప్పుడు బిడెన్ మాత్రం వారికి కీలక ప్రాధాన్యత ఇవ్వాలి అని భావిస్తున్నారు. కీలక సంస్థల సీఈఓలతో పాటుగా యాజమాన్యాలతో ఆయన సమావేశం కానున్నారు. మన దేశం వారితో ముందు ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది.

త్వరలోనే ఈ సమావేశం జరగనుంది. ఎన్నారైలకు ఇప్పటికే బిడెన్ కీలక పదవులు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఐటి సలహాదారులు ఇలా  ప్రతీ ఒక్కరరితో కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తారు. ఐటి రంగానికి ఇప్పుడు మంచి ప్రాధాన్యత ఉండటం భారత్ నుంచి ఐటి ఉత్పత్తులను అమెరికాకు పెంచే విధంగా చర్యలు చేపట్టే ఆలోచనలో భాగంగా ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే బిడెన్ ఎలా వ్యవహరిస్తారు ఏంటీ అనేది చూడాలి. ఇప్పటికే  కేబినేట్ మంత్రులలో ఎక్కువగా మన వాళ్ళే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: