అయితే ఇప్పుడు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఐరోపా దేశాలు కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మన దేశంలో ఇప్పుడు చాలా అనువైన పరిస్థితి ఉందని నిపుణులు చెప్తున్నారు. వైద్య రంగ ఉత్పత్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు చాలా రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఐటి విషయంలో కూడా మన దేశంలో భారీగా పెట్టుబడి పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చైనా విషయంలో ఆసక్తి చూపించే వారు ఇప్పుడు అలా చూపించడం లేదు.
అలాగే బ్రిటన్ లో కూడా పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేసే వారు. కాని ఇప్పుడు మన దేశంలో మానవ వనరులను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. అందుకే ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి చూస్తున్నట్టుగా సమాచారం. భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టాలని భావించే వారికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అనుకున్న వారు ఇక్కడ ఇప్పటికే ఉన్న కంపెనీల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా సమాచారం. వాటిల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఎన్ని కంపెనీలు వస్తాయో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి