అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో భారతీయులు అందరికి అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ కాబోతున్న ట్రంప్ వలస వాసుల వీసాలపై ఆంక్షలు విధించిన విషయం విధితమే. ట్రంప్ అప్పట్లో తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది అమెరికా దేశం విడిచి సొంత దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ట్రంప్ విధించిన  ఈ నిషేధం డిసెంబర్ లో ముగియగా ట్రంప్ మరో సారి ఈ నిషేధాని మార్చి వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో

అమెరికా వచ్చి స్థిరపడాలని కలలు గంటున్న  ఎంతో మంది నిపుణులకు నిరాశే ఎదురయ్యింది. ఈ నిషేధాన్ని పొడిగిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల ఇండో అమెరికన్ వ్యాపార వేత్తలు, ప్రముఖ ఐటీ కంపెనీలు  తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నాయి. ట్రంప్ విధించిన ఈ ఆంక్షలు సడలించాలని ఎంతో మంది భారతీయులు కాబోయే అధ్యక్షుడు బిడెన్ ని కోరారు. అంతేకాదు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై అందరికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే సైన్స్, మాథ్స్ లలో పట్టా సాధించిన వారికి గ్రీన్ కార్డ్ లు అందించాలని విన్నవించారు..ఈ క్రమంలో.

అమెరికా ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్ షిప్ ప్రెసిడెంట్ ముఖేష్ ఆగి మీడియాతో మాట్లాడుతూ వీసాలపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ లలో పట్టాలు పొందిన వారికి తప్పకుండ గ్రీన్ కార్డ్ అందించాలని కోరామని తెలిపారు పట్టాలు పొందిన వారికి గ్రీన్ కార్డులు ఇవ్వడం ద్వారా వేరే దేశాలకు నిష్ణాతులైన విద్యార్ధులు వెళ్ళిపోకుండా ఉంటారని వారు అమెరికాకు సేవలు అందించేలా ఈ విధానం తోడ్పడుతుందని ఆయన తెలిపారు. భారతీయ అమెరికన్స్ లేవనెత్తిన అంశాలపై స్పందించిన బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వీసాలపై ఆంక్షలు ఎత్తేస్తానని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: