కువైట్ లోని భారతీయ ఎన్నారై లకు భారత ఎంబసీ కీలక సూచనలు చేసింది, అంతేకాదు హెచ్చరికలు కూడా జారి చేసింది. భారత్ లోని  వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది పలు దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా భారత్ నుంచి అరబ్బ్ కంట్రీస్ కి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.  అయితే ఇలా వెళ్లి వారిలో చామందికి ఎంబసీ అధికారుల పేర్లతో మోసపూరితమైన కాల్స్ వస్తున్నాయని, ఇలాంటి ఫోన్ లను గుడ్డిగా నమ్మిన వారు మోసపోతున్నారని, లక్షలకు లక్షల డబ్బును కొందరు కేటుగాళ్ళు కాజేస్తున్నారని ఈ మధ్య కాలంలో ఎన్నో సంఘటనలు జరిగాయని ఎంబసీ హెచ్చరించింది.
ఇలాంటి సంఘటనలు రోజూ  ఎక్కడో ఒక చోట వస్తున్నాయని తెలిపింది. దాంతో అప్రమత్తమైన భారత ఎంబసీ అధికారులు కువైట్ లోని ప్రవాస భారతీయులకు కొన్ని కీలక సూచనలు చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తాము ఎంబసీ అధికారులమంటూ ఫోన్ లో చేస్తున్నారని, బెదిరింపు ధోరణితో వసూళ్ళకు పాల్పడుతున్నారని తెలిపారు. అనేక సర్వీసులు పేర్లు చెప్తూ  అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని అన్నారు. అయితే ఏ ఎంబసీ అధకారి కూడా ఫోన్ లు చేసి మీ వివరాలు అడిగి తెలుసుకోరు, ఇలా ఎవరైనా ఫోన్ చేసి అడిగితె మీ వివరాలు ఏమి చెప్పవద్దు, మీ బ్యాంక్ ఖాతా సంఖ్య ను కూడా ఎవరూ అడగరు ఒక వేళ ఎవరైనా అడిగితే వారిపై మీరు సందేహం వ్యక్తం చేయండని అన్నారు.
ఎటువంటి పరిస్థితిలో కూడా మీ ఖాతా వివరాలు, ఫోన్ నెంబర్, , బ్యాంక్ డెబిట్ కార్డ్ నెంబర్ అడిగి తెలుసుకోరని ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది..అక్కడ ఉండే ఎంబసీ కార్యాలయాలలో మాత్రం  అత్యవసరమైన సర్వీసులు పొందాలని సూచించారు. ఈ ఘటనలకు  సంభందంచిన పూర్తి అధికారిక వెబ్సైటు లో ఉంటాయని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: