ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు కొన్ని దేశాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది. రాజకీయంగా మోడీ ఎంత బలంగా ఉన్నా సరే అమెరికా సహా కీలక దేశాల విషయంలో కొన్ని కొన్ని అంశాల్లో కాస్త జాగ్రత్తగా లేకపోతే రాజకీయంగా ఇబ్బంది పడవచ్చు. ప్రధానంగా అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బిడెన్ విషయంలో ఆయన సఖ్యతతో వెళ్తేనే మంచిది అనే భావన ఉంది. జో బిడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోడీని అమెరికా రాకుండా నిషేధించారు.

అయితే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రం పరిస్థితి మారింది. మోడీతో అమెరికా ప్రభుత్వం ఎక్కువగా స్నేహం చేసింది. అయితే ఈ స్నేహం... ట్రంప్ కోసం మోడీ ప్రచారం చేసే వరకు వెళ్ళింది. ఈ కోపం బిడెన్ లో ఉంది. వాస్తవానికి బిడెన్ దూకుడుగా వెళ్ళే నాయకుడు కాదు. ఆయన రాజకీయ చరిత్ర తెలిసిన వాళ్ళకు ఇది స్పష్టత ఉంది. ఇప్పుడు మోడీ కచ్చితంగా ప్రపంచ దేశాలతో ఇబ్బంది పడవచ్చు. అమెరికాతో సన్నిహితంగా ఉండే యూరప్ దేశాలు, అమెరికా చెప్పినట్టు వినే ఇజ్రాయిల్ దేశం సహా పలు దేశాలు  భారత్ కి దూరం అయ్యే అవకాశం ఉంది.

ఇజ్రాయిల్  భారత్ కు ఆయుధాల విషయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వస్తుంది. ఇప్పుడు దూరమయ్యే అవకాశాలు ఉండవచ్చు. మోడీ... అన్ని దేశాలతో సావాసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాని అనుకున్న విధంగా పరిస్థితి లేదు అనే చెప్పాలి. కరోనా ఉన్న సమయంలో కూడా ట్రంప్ కోసం మోడీ భారీ బహిరంగ సభ గుజరాత్ లో ఏర్పాటు చేసారు. అమెరికాలో కూడా సభలు నిర్వహించారు మోడీ. ఏ దేశాధినేత కూడా నేరుగా మరో దేశంలో ప్రచారం చేయలేదు. కచ్చితంగా బిడెన్ మోడీ విషయంలో సానుకూలంగా ఉండకపోవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: