అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు అయిపోయాయి, బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మళ్ళీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం, అందులో ముగ్గురు తెలుగు ఎన్నారైలు పోటీ చేయడం ఏంటని అనుకుంటున్నారా. అసలు విషయం ఏంటంటే. అమెరికా లో అతి పెద్ద తెలుగు సంఘం అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా). లో అధ్యక్ష ఎన్నికల కోలాహలం మొదలయ్యింది. తానా కు సుమారు 4 దశాబ్దాల చరిత్ర ఉంది. అమెరికాలో ఉండే తెలుగు వారికి కోసం అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యకరమాలు చేపడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. విదేశాలలో జరిగే తానా కార్యక్రమాలకు ఆహ్వానం అందితే రాజకీయా నాయకులు మొదలు, సినిమా హీరోలు, ప్రముఖులు సైతం హాజరవుతూ ఎంతో ఆసక్తిగా పాల్గొంటారు...అయితే
రెండేళ్ళకు ఒక సారి జరిగే తానా ఎన్నికల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు తానాకు అధ్యక్షుడుగా ఒక్కసారయినా ఎన్నికవ్వాలని ఎన్నారైలు అందరూ భావిస్తారు కూడా. గతంలో తానా అధ్యక్ష ఎన్నికలకు పోటీ ఉండేది కాదు పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా ఓ వ్యక్తిని నిలబెడితే వారికి అందరూ మద్దతు తెలిపేవారు కానీ కాలం మారింది. యువకులు ఎంతో ఉశ్చాహంగా ఉన్నారు. తానా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తాము కూడా అర్హులమేనని అంటున్నారు. దాంతో ఈ ఏడాది జరగనున్న తానా అధ్యక్ష ఎన్నికల్లో త్రుముఖ పోటీ జరగనుంది.

రెండేళ్ళ పాటు ఉండే ఈ అధ్యక్ష పదవికోసం తానా ఫౌండేషన్ అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ పోటీ పడుతుండగా, తానా బోర్డ్ మాజీ ఛైర్మెన్ కొడాలి నరేన్, అలాగే ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు గోగినేని శ్రీనివాస్ కూడా పోటీ పడుతున్నట్లుగా ప్రకటించారు. దాంతో తానా అధ్యక్ష పదవికి త్రుముఖ పోరు జరగనుంది. ఇప్పటికే ఎవరికీ వారు ప్రచారాలను నిర్వహిస్తూ ఓట్లు కోసం తెలుగు ఎన్నారైలను  అభ్యర్దిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: