అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల హవా రోజు రోజుకు పెరుగుతోంది. భారత్ నుంచి వలస వెళ్ళిన ఎంతో మంది భారతీయులు అమెరికాలో వివిధ రంగాలలో స్థిరపడగా రాజకీయాల్లో రాణిస్తున్న వారి సంఖ్య గతంలో తక్కువగానే కనపడేది. కానీ తాజాగా అమెరికాలో రోజు రోజుకు మారుతున్న రాజకీయపరిణామాల నేపధ్యంలో అందరిని ఆశ్చర్య పరుచుతూ భారతీయులు అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బిడెన్ అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత తన కోటరీలో ఉండే కీలక పదవులలో భారతీయులకు కీలక పదవులు అప్పగించారు. ఇదిలాఉంటే
భారత సంతతికి చెందిన ఇండో అమెరికన్ న్యాయవాది అయిన అప్తాబ్ సిన్సినాటి మేయర్ గా డెమోక్రటిక్ పార్టీ తరుపున నిలబడ్డారు. 38 ఆప్తాబ్ డెమోక్రటిక్ పార్టీలో ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారు. సిన్సినాటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మేయర్ సిన్సినాటి  నగరంలో జీవించే ప్రజల జీవనశైలిలో మార్పులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. తమ దేశంలో కరోనా మహమ్మారి ప్రధాన శత్రువని భావించిన ఆప్తాబ్ కరోన దెబ్బకు కుదేలైన కుటుంభాలకు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత సేవలను సత్వరమే అందించే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కరోనా కారణంగా రోడ్డున పడిన కుటుంభాలకు ఆర్ధిక సాయం అందేలా  చేస్తానని హామీ ఇచ్చారు.  ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూ లో ఆప్తాబ్ మాట్లాడుతూ తమ కుటుంభం ఎన్నో ఏళ్ళ క్రితమే భారత్ నుంచి అమెరికా వచ్చిందని తెలిపారు.2018 లో అమెరికా కాంగ్రెస్ తరుపున జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలోన ఆప్తాబ్ ఈ సారి గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యిందని బిడెన్ ఎంట్రీ తో అన్ని వ్యవస్థలు గాడిలో పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఆప్తాబ్ మేయర్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తరుణంలో డెమోక్రటిక్ పార్టీ నేతలు అందరూ ఆప్తాబ్ కు అండగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: