అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికలు జరిగాయి. హోరా హోరీ పోటీ తరువాత అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా బిడెన్ ఎన్నికయ్యారు. టెంపరి ట్రంప్ ఎన్నో విమర్శలు మూటగట్టుకుని పదవి నుంచీ వైదొలగారు. అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా బిడెన్, కమలా హరీస్ లు ఇద్దరూ  ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. బిడెన్ అధ్యక్షుడిగా గెలుపొందడానికి ఈ వయసులో ఎంతో కష్టపడ్డారు అంటూ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది..అయితే
బిడెన్ అధ్యక్షుడిగా గెలుపొందటంలో కొంతమంది కీలక వ్యక్తులు ముఖ్య పాత్ర పోషించారని వారు బిడెన్ కు లెక్కకు మించి విరాళాలు అందించారని అమెరికాలోని ఓ ప్రముఖ మీడియా కధనం ప్రచురించింది. బిడెన్ గెలుపు అంతా ఆషామాషీగా జరగలేదని, కేవలం కొందరు ఇచ్చిన విరాళాల కారణంగానే బిడెన్ శ్వేత సౌధానికి  వెళ్లేందుకు మారం సుగమం అయ్యిందని సదరు మీడియా పేర్కొంది. ఆ మీడియా కధనం ప్రకారం.జో బిడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలో బిడెన్ కు దాదాపు 11వేల కోట్ల రూపాయల విరాళాలు అందుకున్నారు. వాటిలో 10,500 కోట్ల రూపాయలు గుర్తు తెలియని దాదతల నుంచీ వచ్చినవేనట. గతంలో అంటే డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనే సమయంలో ఎప్పుడు ఈ స్థాయిలో విరాళాలు అందుకోలేదని, విరాళాల సేకరణలో డెమోక్రాట్లు ఎప్పుడు వెనుకపడేవారని కానీ ఈసారి మాత్రం బిడెన్ అధ్యక్షతన విరాళాలు భారీగా సేకరించారని సదరు మీడియా చెప్పుకొచ్చింది. బిడెన్ కు పెద్ద ఎత్తున విరాళాలు రావడానికి, గెలుపొందడానికి కారణం విరాళాల దాతలేనట. అంతేకాదు
నల్లదనం పై యుద్ధం చేస్తామని చెప్పిన బిడెన్ అండ్ కో  ఎన్నికలు దగ్గరపడిన తరువాత తమ సూక్తి విధానాలను పక్కన పెట్టేశారని, విరాళాల సేకరణలో ఎప్పుడు ముందుండే రిపబ్లికన్ పార్టీ ఈ సారి వెనుకబడిందని, అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ బిడెన్ కంటే 5 రెట్లు తక్కువ విరాళాలు వచ్చాయట. బిడెన్ నల్లదనంపై పోరు చేద్దామని చెప్పి ఇంత పెద్ద మొత్తంలో  గుర్తు తెలియని వ్యక్తుల నుంచీ ఎలా విరాళాలు అందుకుంటారని సదరు పత్రిక బిడెన్ పై విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా అధ్యక్షడిగా ఇది కేవలం  బిడెన్ విజయం మాత్రమే కాదని, సదరు విరాళాలు ఇచ్చిన వారి విజయం కూడా అంటోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: