భారత్ అమెరికాల మధ్య సంబంధాలను మెరుగుపరచుకునే విషయంలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కాస్త ఆసక్తి చూపిస్తున్నారనే విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు భారత్ లో కీలకంగా మారుతున్నాయి. భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి యూరప్ దేశాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో అమెరికా అప్రమత్తమవుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడు మారిన తర్వాత కొన్ని కొన్ని పరిస్థితులు కాస్త భారత్ లో ఆసక్తికరంగా మారుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోవడంతో చాలా వరకు అమెరికా కంపెనీలు కూడా ఇప్పుడు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇది కొన్ని దేశాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి అమెరికా కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు కాస్త గట్టిగా ప్రోత్సాహం ఇస్తున్నట్టు కూడా వార్తలు వినపడుతున్నాయి.

మన దేశంతో దగ్గర సంబంధం కొనసాగించడానికి కంపెనీల ఆసక్తి చూపించాలి అని అంతే కాకుండా భారతీయులను తమ కంపెనీల్లోకి తీసుకోవాల్సిందిగా కూడా చెప్పినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు చాలావరకు ఆసక్తి చూపించడం లేదు. రాజకీయ పరిస్థితులు అలాగే దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. అమెరికా వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో చాలా కంపెనీలు ఇప్పుడు భారత్ కు రావడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉండవచ్చు అనే నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి అలాగే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఇద్దరు కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. వచ్చే నెల చివరి వారంలో ఈ భేటీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: