ఒక పక్క పాకిస్తాన్ సహా మన వ్యతిరేక దేశాలు అన్నింటితో సన్నిహితంగా ఉంటూ ఎప్పటికప్పుడు కాకమ్మ కబుర్లు చెప్పే అగ్ర రాజ్యం అమెరికాపై ఒక జాతీయ మీడియా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ జిందాబాద్ నినాదాన్ని దేశద్రోహంగా భావిస్తారా? లేదా మీరు దానిని భావ ప్రకటనా స్వేచ్ఛగా భావిస్తారా? అంటూ జీ న్యూస్ అనే జాతీయ మీడియా ఎడిటర్-ఇన్-చీఫ్ సుధీర్ చౌదరి బుధవారం (మార్చి 31) అమెరికాపై విరుచుకుపడ్డారు. భారత వ్యతిరేక శక్తులకు తరచూ మద్దతు ఇచ్చే అమెరికాకు, మన దేశంపై అభిప్రాయాలు చెప్పడానికి ఏ అధికారం ఉందని నిలదీశారు.

అమెరికాకు చెందిన వాచ్‌డాగ్ ఫ్రీడం హౌస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివాదాస్పదం అయింది. దీనిపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలో నివసిస్తున్న భారత వ్యతిరేక శక్తులపై ఎటువంటి చర్యలు ఉండకూడదని అమెరికా కోరుతోంది అని ఆయన మండిపడ్డారు. భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ తగ్గిపోయిందని, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించారు అని పౌరుల ప్రాథమిక హక్కులను తగ్గించారని అమెరికా పేర్కొంది. ఇక ప్రపంచానికి పెద్దన్న మాదిరిగా ఏ దేశం ఏ చర్యలు మానవ హక్కుల విషయంలో తీసుకోవాలో... అమెరికా ప్రపంచం మొత్తానికి బోధిస్తుందని ఆయన మండిపడ్డారు.

అమెరికాలో, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల విశ్వాసం చారిత్రాత్మకంగా క్షీణించింది అని విమర్శించారు. జాతి వివక్ష క్రమంగా పెరుగుతోంది అని... నల్లజాతి పౌరులలో అభద్రతా భావం ఉందన్నారు. మాజీ సైనికుడు లీ వాంగ్ తన గాయాలను చూపించి తన దేశభక్తిని నిరూపించుకునే పరిస్థితి వచ్చిందని అమెరికా వెల్లడించింది. ఇవన్నీ ఉన్నప్పటికీ, తమ దేశ మానవ హక్కులకు సంబంధించి ఈ నివేదికలో అమెరికా ఎక్కడా ప్రస్తావించలేదు. చట్టవిరుద్ధమైన అరెస్టులు, భావ వ్యక్తీకరణ మరియు పత్రికా స్వేచ్ఛపై పరిమితులు, అవినీతి, మత స్వేచ్ఛ, ఇంటర్నెట్ నిషేధం మరియు మైనారిటీలపై పెరుగుతున్న హింస వంటి వివిధ అంశాలను ఈ నివేదికలో పొందుపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: