ఒక బ్రాండ్ కి పాపులారిటీ రావాలంటే ఆ కంపెనీ చాలా కృషి చేయాల్సి ఉంటుంది. అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడంతోపాటు మార్కెటింగ్ విషయంలో కూడా చాలా తెలివైన స్ట్రాటజీలు వాడుకుంటూ ముందంజలో ఉండాల్సి ఉంటుంది. భారతీయులు విదేశీ బ్రాండ్స్ వైపు మొగ్గు చూపుతుంటారు కానీ చాలా ఇండియన్ కంపెనీ విదేశాల్లో ఉత్తమ బ్రాండ్స్ గా పేరు తెచ్చుకొని వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాయి.


మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీ "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం ప్రారంభించి స్వదేశీ కంపెనీలనే ప్రోత్సహించాలని పదే పదే చెబుతున్నారు. దీనివల్ల భారతదేశం ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు నిరుద్యోగ సమస్యలు కూడా తీరుతాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలంటే.. స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించడం ఎంతైనా అవసరం. అయితే స్వదేశీ కంపెనీలు సైతం నాణ్యతతో ఏమాత్రం తీసిపోవు. అతి మధురమైన, రుచికరమైన చాక్లెట్స్ తయారు చేయటంలో అమెరికా, ఇంగ్లాండ్ వంటి విదేశీ కంపెనీలు ఎంత అంకితభావంతో పని చేస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ అంతర్జాతీయ చాక్లెట్ అవార్డ్స్ కార్యక్రమంలో వాటన్నిటి కంటే కూడా భారతదేశానికి చెందిన ఒక చాక్లెట్ బ్రాండే ఉత్తమ తయారీదారిగా ఎన్నుకోబడింది.



పూర్తి వివరాలు తెలుసుకుంటే.. కేరళకు చెందిన పాల్ & మైక్ బ్రాండ్ వారు తయారుచేసిన '64% డార్క్ సిచువాన్ పెప్పర్, ఆరెంజ్ పీల్ వేగన్ చాక్లెట్' ఇంటర్నేషనల్ చాక్లెట్ అవార్డ్స్ లో సిల్వర్ గెలుచుకుంది. నిజానికి ఒక ఇండియన్ కంపెనీ ఈ అవార్డు గెలుచుకోవడం ఇదే మొట్టమొదటిసారి. మేలైన కోకో బీన్స్ సేకరించడం నుంచి చాక్లెట్స్ తయారు చేసేంతవరకు మొత్తం ప్రక్రియను జాగ్రత్తగా చూసుకునే శిల్పకళా చాక్లెట్ ప్రొడ్యూస్ టీమ్ లో పాల్ & మైక్ బ్రాండ్ కూడా ఒకటి. దీనిని 'బీన్ టు బార్' లేదా 'ఫార్మ్ టు బార్' అని పిలుస్తుంటారు.



ఈ కంపెనీ బీన్స్ పండించడం నుంచి చాక్లెట్స్ తయారు చేయడం వరకు అన్ని బాధ్యతలు తానే చూసుకుంటుంది. కొచ్చి, కోయంబత్తూరు వంటి ప్రదేశాల్లో కోకో పండించే అక్కడే పులియబెడతారు. కేరళ, ఆంధ్రప్రదేశ్ రైతుల చేత తడి కోకో గింజలను పండిస్తారు. అంతే కాకుండా పంటకోత కార్యకలాపాలన్నింటినీ దగ్గరుండి చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంటారు. అలాగే తాజా పండ్లు, కాయలు, సుగంధ ద్రవ్యాలు, స్వచ్ఛమైన పూల స్వేదనం మాత్రమే తమ చాక్లెట్ల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. పాల్ అండ్ మైక్‌ కంపెనీకి సింథైట్ మద్దతు ఉంది. 200 మిలియన్ డాలర్ల టర్న్ ఓవర్ గల సింథైట్ ఆహార పదార్ధాల సంస్థకి కొచ్చిలో ప్రధాన కార్యాలయం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: