గత కొద్ది రోజులుగా స్విస్‌బ్యాంకుల్లో భారతీయల నిధుల గురించి అనేక వార్తలు వస్తున్నాయి. గత ఏడాది అనగా 2020 సంవత్సరం లో భారతీయ వ్యక్తులు, ఇండియన్ సంస్థలు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నిధులు భారీగా పెరిగినట్లు స్విట్జర్లాండ్‌ జాతీయ బ్యాంక్ అయిన "స్విస్ నేషనల్ బ్యాంక్" వెల్లడించిందని భారతీయ జాతీయ మీడియా కూడా అనేక వార్తలు ప్రచురించింది. స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లోని భారతీయుల సంపద ఒక్క ఏడాదిలోనే సుమారు రూ. 20 వేల 700 కోట్లకు పెరిగిందని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ పేర్కొందని దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు వార్తలు రాసుకొచ్చాయి.

2019వ సంవత్సరం చివరి వరకు భారతీయుల నిధులు రూ.6 వేల 625 కోట్లు ఉండగా ఆ సంపద 2020నాటికి 20 వేల 700 కోట్లకు చేరుకుందని.. గత కొన్ని సంవత్సరాలుగా స్విస్ బ్యాంకుల్లో జమయ్యే నిధులు సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కానీ 2020లో భారతీయులు అనూహ్య రీతిలో సంపద దాచుకోవడంతో డిక్లైన్ ట్రెండ్ ఒక్కసారిగా మారిపోయిందని.. గడిచిన 13 ఏళ్లలో ఈ స్థాయిలో భారతీయ నిధులు పెరగడం ఇదే తొలిసారని స్విస్ నేషనల్ బ్యాంక్ కూడా విస్పష్టం చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ స్విస్ బ్యాంకులలో భారతీయల నిధుల గురించి వస్తున్న వార్తలను ఖండించింది.

‘స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB) తాజాగా వెల్లడించిన డేటా ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లో ఇండియన్స్ బ్లాక్ మనీ జమ అయిందని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదు. ఎస్‌ఎన్‌బీ చెప్పిన మొత్తం లో భారతీయులు, ఎన్నారైల సంపద లేదు.. అది విదేశీయులు జమ చేసిన సంపద’ అని కేంద్ర మంత్రిత్వ శాఖ శనివారం రోజు క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా 2019 ఏడాది నుంచి ఖాతాదారుల డిపాజిట్లు తగ్గిపోయాయని.. ఖాతాదారులందరూ బాండ్లు, సెక్యూరిటీస్, తదితర ఫైనాన్షియల్ పద్ధతులలో సంపద డిపాజిట్ చేస్తూ వస్తున్నారని మంత్రిత్వశాఖ వివరించింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ స్విస్ బ్యాంకుల నుంచి భారతీయుల నిధులకు సంబంధించి వివ‌రాల‌ను సేకరించేందుకు సిద్ధమైంది. పూర్తి సమాచారం అందిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపదకు సంబంధించి సరైన లెక్కలను కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: