ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికించిన వైర‌స్‌ క‌రోనా వైర‌స్. ఈ వైర‌స్ భారీన ఇప్ప‌టి వర‌కు కొట్లాది మంది ప్ర‌జ‌లు ప‌డ్డారు. అంతే కాకుండా ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు మృత్యు వాత ప‌డ్డారు. ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలు అయ్యారు. ఈ క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌పంచాన్ని విముక్తి చేయ‌డానికి ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది శాస్త్ర వేత్త‌లు ప్ర‌యోగాలు చేశారు. అందులో భాగంగానే శాస్త్ర వేత్త‌లు క‌రోనా వ్యాక్సీన్ ల‌ను క‌నుగొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దుల ర‌కాల వ్యాక్సిన్ లు ప్ర‌పంచానికి అందు బాటులో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సీన్ వేసుకోవాల‌ని ప్ర‌పంచ దేశాలు విస్రృతంగా ప్ర‌చారం చేస్తున్నాయి. అయితే కొన్ని దేశాల ప్ర‌జ‌లు వ్యాక్సీన్ ల‌ను వ్య‌తిరేకిస్తున్నారు.



తాజాగా ఆస్ట్రేలీయా దేశంలో యాంటీ వ్యాక్సీన్ ఉద్య‌మాలు విస్రృతంగా జ‌రుగుతున్నాయి. ఆస్ట్రేలీయా రాజ‌ధాని అయిన మెల్‌బోర్న్ న‌గ‌రంలో బుధ‌వారం యాంటీ వ్యాక్సీన్ నిర‌స‌న‌లు హింసాత్మంగా మారాయి. ఆందోళ‌న కారులు రెచ్చి పొవ‌డంతో పోలీసులు నిర‌స‌న‌కారుల‌పై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో నిర‌స‌న కారుల‌కు పోలీసుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. కాగ ఆస్ట్రేలీయా లో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు అమ‌లు చేస్తుంది. సాధార‌ణ కార్మికుల‌తో పాటు నిర్మాణ రంగ కార్మికులు త‌ప్ప కుండా ఒక డోస్ వేసుకోవాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అంతే కాకుండా ఒక డోస్ వేసు కున్న కార్మికులే ప‌నుల‌ల్లో కి వెళ్లాల‌ని ఆస్ట్రేలీయా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని కార్మికులు వ్య‌తిరేకించారు. తాము వ్యాక్సీన్ వెసుకోమని యాంటీ వ్యాక్సీన్ ఉద్య‌మానికి తెర లేపారు.




కాగ గ‌తంలో కెనడా దేశ‌లోనూ అక్క‌డి ప్ర‌జ‌లు యాంటి వ్యాక్సీన్ ఉద్య‌మాన్ని చేశారు. చాలా చోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు కూడా చోటు చేసుకున్నాయ్. అంతే కాకుండా కెన‌డా దేశ ప్ర‌ధాని జ‌స్టీన్ ట్రూడో పై కూడా యాంటీ వ్యాక్సీన్ ఉద్య‌మకారులు రాళ్లు కూడా రువ్వారు. కెన‌డా తో పాటు చాలా దేశాల్లో యాంటీ వ్యాక్సీన్ ఉద్య‌మాలు వ‌స్తున్నాయి. అస‌లే థార్డ్ వేవ్ వ‌స్తుంద‌ని శాస్త్ర వేత్త‌లు చెబుతుంటే ఇలా యాంటీ వ్యాక్సీన్ ఉద్య‌మాలు రావ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్ర వ్య‌తిరేకిత వ్య‌క్తం అవుతుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: