ప్రతి మహిళ ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వేధింపులకు వివక్షకు గురవుతూనే ఉంది. అయితే కేవలం మన దేశంలో మాత్రమే కాదు అగ్రరాజ్యం అని చెప్పుకునే ఎన్నో దేశాలలో కూడా ఇలాంటి వివక్ష లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆడుగడుగునా మహిళ తనకి తాను రక్షణ కల్పించుకోవడానికి పోరాడుతూనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి బిడ్డకు పాలిచ్చే తల్లులను కూడా కామంతో చూసే మానవమృగాలు నేటి సమాజంలో కనబడుతున్నాయి. చంటి బిడ్డను ఎత్తుకుని తల్లి ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఇక బిడ్డ ఏడిస్తే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఇక చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా తన బిడ్డకు పాలు ఇవ్వడం చేస్తూ ఉంటుంది తల్లి.


 ఇది ఒక రకంగా మంచిది శ్రేయస్కరం కూడా. కానీ ఇలా బిడ్డకు తల్లి పాలు ఇవ్వడాన్ని కూడా కామం తో నే చూస్తూన్న కొంతమంది ఆకతాయిలు ఇలా పబ్లిక్ ప్లేస్ లలో తల్లి పిల్లలకు చనుబాలు ఇస్తున్న సమయంలో ఫోటోలు తీయడం లాంటివి కూడా చేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఎంతో మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఇటీవలే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎవరైనా చనుబాలు పడుతున్న ఈ సమయంలో తల్లి ఫొటోలుగాని వీడియోలు తీస్తే మాత్రం రెండేళ్ల పాటు జైలు శిక్ష  తప్పదు అంటూ హెచ్చరిస్తుంది ప్రభుత్వం. అయితే కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే కాదు ఏకంగా ప్రజాప్రతినిధులు సైతం ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని చెప్పాలి.


 బ్రిటన్లో పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు స్టెల్లా క్రిస్  ఒకానొక సమయంలో లండన్లో రైలులో ప్రయాణిస్తున్న సమయంలో నాలుగు నెలల బిడ్డ పాలు ఇచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఫోటో తీసాడట. ఇక ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మహిళా ఎంపీ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అది నేరం కిందకు రాదు అని కేసు కూడా నమోదు చేసుకో లేదట పోలీసులు. ఈ క్రమంలోనే ఇక మహిళలు ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకురావాలని టాప్ స్థాప్ బెస్ట్ ప్రైస్ట్ పేరుతో  ఉద్యమం చేపట్టగా చివరికి ఇంగ్లాండ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: