కిక్ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడో లేకపోతే ఇంకా ఏంటో తెలియదు గానీ.. కిక్కు కోసం ఎవరు చేయని పని అతను చేశాడు. ఇంతకీ ఏం చేసాడు అనుకుంటున్నారా ఏకంగా ఉద్యోగం వదిలేసాడు. అంతేనా అందులో కొత్తేముంది అని అనుకుంటున్నారు కదా. అతని ఉద్యోగం గురించి తెలిస్తే మాత్రం అలాంటి ఉద్యోగాన్ని వదులుకొని అతను తప్పు చేశాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను ఉద్యోగం ద్వారా ఏకంగా 3.5 కోట్ల రూపాయల జీతం సంపాదిస్తున్నాడు. కానీ కిక్ కోసం నిమిషాల్లో ఉద్యోగానికి రిజైన్ చేసేసాడు.
యువకుడి స్టోరీ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 2017లో మైకెల్ లైన్ ఓటిటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేరాడు. అంతకుముందు అమెజాన్ లో కూడా పని చేసాడు. ఇక కొత్త లో ఎంతో ఉత్సాహంగా పనిచేశాడు ఈ యువకుడు. ఆ తర్వాత కాలంలో సీనియారిటీని బట్టి అతని జీవితం ఏకంగా 3.5 కోట్లు గా మారిపోయింది. కానీ ఆ తర్వాత కాలంలో ప్రతిరోజూ ఆఫీస్ కి రావడం ఇంటికి వెళ్ళడం రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసింది. దీంతో కిక్ దొబ్బింది అనుకొని చివరికి జాబ్ కు రిజైన్ చేశాడు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి..