దేనితో అయినా పెట్టుకోవచ్చు గానీ పంచ భూతాలతో మాత్రం అస్సలు పెట్టు కోవద్దు అని అంటుంటారు పెద్దలు. కానీ ఇటీవలి కాలం లో మనుషులు ప్రకృతి వైపరీత్యాలకు కారణ మవుతున్నారు అన్న విషయం తెలిసిందే. అధునాతన జీవన శైలి మోజు లో పడి ఏకంగా ప్రకృతిని నాశనం చేస్తున్న ఘటనలు  ఎక్కువగా వెలుగు లోకి వస్తున్నాయి. ఏకం గా జనావాసాలు నిర్మించు కునేందుకు అడవులను నరుకుతూ భవనాలను కడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇలాంటి కారణం గానే ఈ ప్రకృతి వైపరీత్యాల తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది.


 ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక దేశం లో మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే ప్రస్తుతం బ్రిటన్ లో ప్రకృతి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది అన్నట్లుగా మారి పోయింది పరిస్థితి. ఏకం గా బ్రిటన్ లో 5 లక్షల ఇళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం.  సముద్రతీర ప్రాంతం లో ఎంతో విలాసవంతమైన గృహాలను కట్టుకున్నారు ప్రజలు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్లను నిర్మించుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు సముద్రం ఉగ్రరూపం దాల్చింది. రోజు రోజుకు ముందుకు వచ్చేస్తోంది.


 ఈ క్రమం లోనే ఇళ్లకు సమీపం లోకి సముద్రం రావడం గమనార్హం. దీంతో ఈ ఏడాది లో బ్రిటన్లోని లేమా ప్రాంతం లో 5 లక్షల ఇళ్లు సముద్రం ముందుకు రావడం కారణం గా కుప్పకూలి పోతాయట. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే ప్రత్యామ్నాయాలు నివాసాలు చూసుకోవాలి అంటూ ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం.  అదే సమయం లోనే తమకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ నివాసాలను చూపించాలి అంటు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.  ఇక ఇది కాస్త ప్రస్తుతం బ్రిటన్లో చర్చనీయాంశం గా మారి పోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: