రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మొదలై రోజులు గడిచిపోతున్నాయి తప్ప పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు.  ఉక్రెయిన్ పై తమ ఆధిపత్యం సాధించేందుకు రష్యా సైనిక చర్య పేరుతో అల్లకల్లోల పరిస్థితులు ను సృష్టించింది. ఉక్రెయిన్ పై తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే రష్యా లాంటి అగ్రదేశం తో ఆయుధబలంలో సైనిక బలం లో ఎక్కడ సరితూగని ఉక్రెయిన్ పట్టువీడని విక్రమార్కుడులా తమ సార్వభౌమత్వాన్ని  కాపాడుకునేందుకు వీరోచిత పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధం అటు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులకు కారణం అవుతుంది. అంతేకాదు ఇక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఎన్నో దేశాలు వివిధ రకాల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయ్ అనే చెప్పాలి. అయితే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మొదలై దాదాపు వంద రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. కొన్ని ప్రాంతాలను కూడా అర్థం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాము అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు యుద్ధాన్ని విరమించే ప్రసక్తి లేదు అంటూ ఇటీవల రష్యా తేల్చిచెప్పింది అనే విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో అన్న దానిపై ఒక స్పష్టత లేకుండా పోయింది. అయితే ఇటీవల ఇదే విషయంపై నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం  ఏళ్ల తరబడి జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు వివిధ రూపాల్లో ఉక్రెయిన్ కు ఇస్తున్న మద్దతును ఇలాగే కొనసాగించాలని సూచించారు. మరోవైపు నాలుగు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఇరుదేశాల సైనిక లలో కూడా నైతిక స్థైర్యం దెబ్బతింటుందని బ్రిటన్ రక్షణశాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలా ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అన్న దానిపై ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: