ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో రోజురోజుకూ పరిస్థితి అధ్వానంగా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు ఊహించని రేంజిలో పెరిగిపోయాయ్. దీంతో సామాన్య ప్రజల జీవితం మొత్తం దుర్భరంగా మారిపోయింది అనే విషయం తెలిసిందే. ఇక అక్కడ రోజురోజుకు ఆర్థిక సంక్షోభం పెరిగిపోతున్న నేపథ్యంలో అటు పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇది కాస్త సామాన్యుల పాలిట శాపంగా మారి పోతుంది అని చెప్పాలి. అయితే మన దేశంలో పెట్రోల్ ధరలు కేవలం సెంచరీ దాటిపోతే గగ్గోలు పెట్టుకుంటున్నాము. కానీ అటు శ్రీలంకలో మాత్రం పెట్రోల్ ధరలు  అంతకుమించి అనే రేంజ్ లోనే పెరిగిపోతున్నాయి.


 శ్రీలంకలో ప్రస్తుతం ఇంధనం నిలువల  కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇలా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని చెప్పాలి. ఇక ఇతర దేశాలు ఇంధనం నిలువలను  శ్రీలంకకు  సహాయం అందిస్తూ ఉన్నప్పటికీ అక్కడ ఏర్పడిన కొరత మాత్రం తీరడం లేదు. పెట్రోల్ రేట్లు దాదాపు డబుల్ సెంచరీ దాటిపోయాయి. డబుల్ సెంచరీ దాటిపోయిన తర్వాత అయినా పెట్రోల్ దొరుకుతుందా అంటే అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. శ్రీలంకలో పెట్రోల్ కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.



 దీంతో వాహనదారులు ఇక పెట్రోల్ కోసం పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు అనే చెప్పాలి. ఇకపోతే శ్రీలంక రాజధాని కొలంబోలో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు అజీవన్ సదాశివన్. అయితే కారులో పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్ క్యూ లో నిలబడ్డాడు. ఇక రెండు రోజుల నుంచి స్నానం కూడా చేయకుండా కారులోనే ఉండిపోయాడు సదరు వ్యక్తి. అయితే ఇది కేవలం ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదు. దేశంలో ఉన్న చాలామంది క్యాబ్ డ్రైవర్లకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులకు కడుపు నింపాలంటే  ఎంతటి కష్టాన్ని అయినా భరించాల్సిందే అంటూ సమాధానం చెబుతున్నారు క్యాబ్ డ్రైవర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: