సాధారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు చోటు దక్కించుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. అయితే ఇలా వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే అంత సులభమైన విషయం ఏమీ కాదు ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే గిన్నిస్ రికార్డు సాధించడం కోసం ఎంతోమంది ఎన్నో రకాల ఫీట్లు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి ఎంతగానో రిస్కులు చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వరకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవడం కోసం ఎంతోమంది తమలో టాలెంటరు నిరూపించుకోవడం చూశాము.  కానీ ఇక్కడ మాత్రం ఒక యువకుడు ఏకంగా మందు కొట్టడం కారణంగా గిన్నిస్ బుక్ లో రికార్డు సృష్టించాడు. ఇది నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ఇదే నిజం అని చెప్పాలి.ఇంగ్లాండులోనే బ్రైటన్ కు చెందిన నాదన్ క్రింప్  అనే 22 ఏళ్ళ యువకుడు మందు కొట్టడంలో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు. ఏకంగా 17గంటల వ్యవధిలోనే 67 పబ్ లకు వెళ్లి అతను మందు పుచ్చుకున్నాడు. ఇక తద్వారా 24 గంటల వ్యవధిలో అత్యధిక పబ్బులను సందర్శించిన వ్యక్తిగా గినిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాడు.


 ఇక ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్కు చెందిన గ్యారేత్ మర్పి అనే యువకుడు 17 గంటల్లో 56 పబ్ లను సందర్శించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పగా ఇప్పుడు క్రింప్ ఈ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే గిన్నిస్ బుక్ నిర్వాహకుల  నిబంధనల ప్రకారం  సందర్శించే ప్రతి పబ్ లో కూడా మద్యం మాత్రమే సేవించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ క్రింప్ మాత్రం ఒక్క పబ్లో మద్యం మరో పబ్లో పానీయం సేవిస్తూ ముందుకు వెళ్ళాడు. ఇలా రోజంతా సుమారు 30 లీటర్ల  పానీయాలు సేవించడం ద్వారా రికార్డ్ సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: