గత కొన్ని నెలల నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య ఎంత తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సైనిక చర్య పేరుతో రష్యా ఉక్రెయిన్ లో ఉన్న అన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే పసికూన లాంటి ఉక్రెయిన్ మాత్రం తమ ఆత్మగౌరవాన్ని రష్యా దగ్గర తాకట్టు పెట్టేందుకు మాత్రం సిద్ధమవడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో వీరోచితంగా పోరాటం చేస్తూ రష్యా సైనికులకు దీటుగా సమాధానం చెబుతుంది ఉక్రెయిన్ సైన్యం.


 వెరసి రోజులు గడుస్తున్నాయి తప్ప అటు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి. శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని అటు ప్రపంచ దేశాలు ఎంతలా సూచనలు చేసిన ఒకవైపు రష్యా మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై  యుద్ధం కోసం కొత్తగా సైనికుల ఎంపిక కూడా చేపట్టినట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇకపోతే అటు అగ్ర దేశంగా కొనసాగుతున్న రష్యాకు పసికూన ఉక్రెయిన్ చేతిలో మాత్రం పరాభవం ఎదురయ్యే పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పాలి.


 ఎందుకంటే ఉక్రెయిన్ ను చేజిక్కించుకునేందుకు రష్యా సైన్యం చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి వరకు మారణ హోమాన్ని సృష్టించి ఉక్రెయిన్ లో  ఉన్న ఎన్నో ప్రాంతాలను రష్యా సైన్యం ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్  సైనికులు రష్యా అధీనంలోకి తీసుకున్న ప్రాంతాలను మళ్లీ స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవలే డొనేస్ట్క్ రీజియన్ లోని లెమన్ నగరాని ఉక్రెయిన్ సైన్యం చుట్టుముట్టింది. ఈ నగరంలో 5000 మందికి పైగా రష్యా సైన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొంతమంది మరణించగా మరి కొంతమంది తమ సైన్యానికిచిక్కారు అంటూ ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: