ప్రస్తుతం ఇండియా మొత్తం డిజిటల్ ప్రపంచం వైపు దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే  ప్రస్తుతం ఆర్థికపరమైన లావాదేవీలు ఆన్లైన్లో జరపడం మాత్రమే కాదు ఇక ఏం కావాలన్నా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇంట్లో హాయిగా కూర్చుని ఇక డోర్ వద్దకు తెప్పించుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి సర్వీస్ లు అందించడానికి నేటి రోజుల్లో ఎన్నో ఈ కామర్స్ సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇక నాణ్యమైన సర్వీసులను పొందుతున్నారు నేటిజన్లు. ఈ క్రమంలోనే ఇలా టెక్నాలజీ పెరిగిపోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంది అని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు అని చెప్పాలి.


 ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థల సర్వీస్ల కారణంగా ఇక కావాల్సిన వస్తువులను అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ఆర్డర్ చేయడం.. ఎక్కడికో వెళ్ళకుండా ఇంటి దగ్గరకే ఇక తమకు కావాల్సిన వస్తువులు తెప్పించుకోవడం ద్వారా ఇక ఎన్నో లాభాలను పొందగలుగుతున్నాం అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఆన్లైన్లో ఆర్డర్స్ కారణంగా లాభాలు మాత్రమే కాదు నష్టాలు కూడా జరుగుతున్నాయి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఆర్డర్ చేసినప్పుడు మనం ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరొకటి వచ్చి ఎంతోమంది కస్టమర్లకు షాకులు తగులుతూ ఉన్నాయి.


 ఇక ఇటీవల బ్రిటన్ లో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. బ్రిటన్ కు చెందిన మహిళ ఒక ఆన్లైన్ యాప్ లో లెవీస్ జీన్స్ ఆర్డర్ చేసింది. అయితే రెండు రోజుల తర్వాత ఆమె ఆర్డర్ ఇంటికి డెలివరీ అయింది. ఇక సంతోషంగా ఇక డెలివరీ అయిన పార్సల్ బాక్స్ ని తెరవడానికి ప్రయత్నించింది. కానీ ఎందుకో లోపల నుంచి దుర్వాసన రావడాన్ని గమనించింది. ఏంటా అని తెరిచి చూడగా లోపల కుళ్లిపోయిన  ఉల్లిపాయలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన మహిళ వెంటనే ఫిర్యాదు చేసింది. అయితే కస్టమర్ కేర్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇకపోతే మహిళా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: