అగ్ర‌రాజ్యం అమెరికా షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ భారత్‌ను దెబ్బతీసేందుకు అమెరికా హెచ్-1బీ వీసా అస్ర్తాన్ని ప్రయోగించనుంది. డాటా లోకలైజేషన్ చేస్తున్న దేశాలకు హెచ్-1బీ వీసాల్లో 10-15 శాతం కోత విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. అంతర్జాతీయ సంస్థలు భారతీయుల డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలంటూ కేంద్రం ఇటీవల కొత్త నిబంధలను తీసుకొచ్చింది. ఇది పలు అమెరికా కంపెనీలకు ఆర్థికంగా భారం కానుంది. ఈ నేపథ్యంలో భారత ఐటీ రంగాన్ని దెబ్బతీసేందుకు హెచ్-1బీ వీసాల అంశాన్ని తెరపైకి తెచ్చింది.


 అమెరికా ఏటా జారీ చేసే 85వేల హెచ్-1బీ వీసాల్లో 70 శాతం వరకు భారతీయులే పొందుతున్నారు. ఏటా ఇండియన్లకు ఇస్తున్న హెచ్​1బీ వీసాల్లో 10 నుంచి 15 శాతం కోత పెట్టాలని అమెరికా నిర్ణయించినట్టు గతవారమే తమకు ప్రభుత్వం వివరించిందని ఇద్దరు సీనియర్​ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీల పప్పులుడకకుండా వాటి అధికారాలను తగ్గించేందుకు ఇండియా తీసుకున్న ‘డేటా లోకలైజేషన్​’పైనే అమెరికా ఈ వీసా తగ్గింపు నిర్ణయం తీసుకుందన్నారు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. అయితే, ఒక్క ఇండియా మాత్రమే కాకుండా డేటా లోకలైజేషన్​కు డిమాండ్​ చేసే దేశాలన్నింటికీ ఇది వర్తించేలా నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఏ దేశమైతే డేటా లోకలైజేషన్​కు డిమాండ్​ చేస్తుందో ఆ దేశానికి ఏటా ఇచ్చే వీసాల్లో 15 శాతం వీసాలను కోత పెట్టేందుకు డిసైడ్​ అయిందన్నారు. అమెరికా ట్రేడ్​ రిప్రజెంటేటివ్​ (యూఎస్​టీఆర్​) ఆఫీస్​కు చెందిన ఓ మహిళా ప్రతినిధి.. విదేశాంగ శాఖను ఇదే విషయంపై ప్రశ్నించినా స్పందించలేదు.
వీసాల‌ను తగ్గించాలన్న ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారీగా ప్రభావం పడేది మాత్రం ఇండియన్​ కంపెనీలపైనేనని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​), ఇన్ఫోసిస్​లపైనే ప్రభావం ఎక్కువుంటుందని అంటున్నారు. అయితే, అమెరికా నిర్ణయంతో దేశంపై పడే ప్రభావమేంటో వెంటనే తేల్చాల్సిందిగా అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించినట్టు సమాచారం. విదేశాంగ శాఖ మాత్రం దీనిపై స్పందించలేదు. ఇక, విదేశీ కంపెనీల పేమెంట్స్​ డేటాను ‘ఇండియాలోనే’ స్టోర్​ చేయాలని గత ఏడాదే కేంద్ర ప్రభుత్వం రూల్​ పెట్టింది. సున్నితమైన అంశాలను ప్రాసెస్​ చేసే విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, అందులో భాగంగానే డేటాను ఇక్కడే స్టోర్​ చేయాలని కంపెనీలను ఆదేశించింది. దీని వల్ల అమెరికా కంపెనీలైన మాస్టర్​కార్డ్​, వీసా వంటి కంపెనీలు భారీగా నష్టపోయాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి రూల్స్​ పెట్టడం వల్ల దేశాల మధ్య డేటా మార్పిడి ఆగిపోతుందని, కంపెనీలకు ఖర్చు పెరుగుతుందని కొందరు నిపుణులు విమర్శలు గుప్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: