అమెరికాలో శాశ్వత నివాసం పొందాలంటే తప్పకుండా  గ్రీన్ కార్డ్ దారులై ఉండాల్సిందే. ఈ గ్రీన్ కార్డ్ కోసం లక్షల మంది భారతీయులు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన ఎంతో మంది భారతీయులకి గ్రీన్ కార్డ్ అందని ద్రాక్షగానే మిగులుతూ వస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులకే గ్రీన్ కార్డులు అని చెప్పడంతో ఇక గ్రీన్ కార్డ్ పై ఆశలు వదులుకున్నారు భారతీయులు. అయితే

 Related image

గ్రీన్ కార్డ్ ని ఈబీ-5 పెట్టుబడి వీసా ద్వారా పొందే ఏర్పాటు చేసిన అమెరికా ప్రభుత్వం. ఇప్పుడు ఈ వీసా విషయంలో సైతం భారీ మార్పులు చేపట్టింది. గతంలో ఈబీ-5 వీసాపై 5 లక్షల డాలర్ల పెట్టుబడి నిభందన ఉండేది. కానీ ట్రంప్ సర్కార్ మార్పులు చేర్పుల వలన ఇప్పుడు ఈ విధానంలో దాదాపు 10.35 లక్షల డాలర్లకి పెంచేసింది. ఈ విషయాన్ని మేరీల్యాండ్ సెంటర్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా డైరెక్టర్‌ వివేక్‌ ఆర్‌.రావు తెలిపారు.

 Image result for eb 5 visa

దాంతో అమెరికాకి విదేశాల నుంచీ ఈబీ-5 వీసా కోసం వచ్చే దరఖాస్తులు 80 శాతం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉందని ఆయన అన్నారు. అయితే ఈలోగానే కనీస పెట్టుబడి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: