అమెరికాలో శాశ్వత నివాసం పొందాలంటే గ్రీన్ కార్డ్ తప్పని సరి అనేది అందరికి తెలిసిందే. అయితే ట్రంప్ విధానాల వలన, ట్రంప్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న నిభందనల కారణంగా గ్రీన్ కార్డ్ కల చేదిరిపోతోందని అంటున్నారు నిపుణులు. గ్రీన్ కార్డ్ పొందాలంటే ఎన్నో ఖటినమైన నిభందనలు దాటుకుంటూ వెళ్ళాలి. లేదా అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా గ్రీన్ కార్డ్ అనుమతి పొందవచ్చు. అయితే

 Image result for eb 5 visa

ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ హయాంలో ఈ పెట్టుబడి ద్వారా పొందే గ్రీన్ కార్డ్ వీసా కూడా ఖటినం చేసేశారు. ఈబీ-5 వీసా కి గతంలో ఉన్న నిభంధనలని సవరించింది ఇమ్మిగ్రేషన్. టార్గెటెడ్‌ ఎంప్లాయిమెంట్‌ ఏరియా లో కనీస పెట్టుబడిని 50 వేల డాలర్ల నుంచి 90 వేల డాలర్లకి అమాంతం పెంచేసింది.

 à°ˆà°¬à±€ 5 వీసా మరింత కఠినం

అలాగే దేశంలోని ఇతర కేటగిరీల్లో పెట్టుబడిని 1 మి. డాలర్ల నుంచి 1.8 మిలియన్‌ డాలర్లకి పెంచేసింది.  ఈ మేరకు కొత్త నిభందనలని ప్రచురించింది. ఈబీ-5 వీసా కోసం 50 వేల డాలర్ల కనీస పెట్టుబడి పెట్టాలని 1999లోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మొత్తాన్ని ఇప్పుడు 90 వేల డాలర్లకు పెంచామని తెలిపారు. అయితే ఈ నిభందన గనుకా అమలులోకి వస్తే అధికశాతం మంది ఇబ్బంది పడేది మాత్రం భారతీయులే అనేది నిపుణుల వాదన.


మరింత సమాచారం తెలుసుకోండి: