శంకర్ దాదా MBBS సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో ఓ వ్యక్తి తాను చనిపోతున్నాను అంటూ చిరంజీవికి ఫోన్ చేసి చెప్పడం, చిరజీవి ఆ సమస్యకి పరిష్కారం చెప్పి అతడి ఆత్మ హత్య ప్రయత్నాన్ని విరమింప చేయడం అన్నీ జరిగిపోతాయి. ఈ సీన్ అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాకే హైలెట్ అయ్యింది. అయితే యూఏఈ లో కూడా ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది.

 Image result for uae police stop indian suicide attempt

యూఏఈ లో కొన్నేళ్లుగా ఉంటున్న ఓ భారతీయుడు ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ట్విట్టర్ లో తాను ఆత్మ హత్య చేసుకుంటున్నట్టుగా ట్వీట్ చేశాడు. ఈ సందేశంతో ఒక్కసారిగా స్పందించిన షార్జా పోలీసులు అతడితో కాంటాక్ట్ అయ్యారు. ఫోన్ లో మాట్లాడిన పోలీసులు అతడి ఆత్మ హత్యకి గల కారణాలని తెలుసుకుని అతడి సమస్యలని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. దాంతో స్పందించిన అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

 Image result for suicide attempt

యూఏఈ పోలీసులు వెంటనే అతడు ఉంటున్న ప్రదేశానికి వెళ్లి అన్ని విధాలుగా నచ్చ జెప్పారు. అతడి సమస్యలని ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు. తప్పకుండా అతడి సమస్యలని తీర్చుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు అతడికి నిపుణులచే కౌన్సిలింగ్ ఇచ్చారు కూడా. ఈ ఘటనపై స్పదించిన అధికారులు మేము ఇలాంటి విషయాలు సీరియస్ గానే తీసుకుంటామని, తడిని కాపాడినందుకు సంతోషంగా ఉందని, అతడి సమస్యలు త్వరలోనే తీర్చుతామని హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: