అమెరికాలో ఎంతో మంది ఏపీకి చెందిన ఎన్నారైలు ఉన్నారు.వారిలో అన్ని వర్గాలకి చెందిన ఎన్నారైలు ఉన్నారు. వారందరిలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎన్నారైలు కూడా ఎక్కువగానే ఉన్నారు.  అందుకే అమెరికాలో ఉన్న తెలుగు వారిలో ముస్లిమ్స్ అందరం కలిసి ఒకే వేదికని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో తమవైపు నుంచీ కూడా ఏపీ అభివృద్ధికి అమెరికాలో ఉంటున్న ముస్లిమ్స్ అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు.

 Image result for ap-muslims-association-of-north-america-meeting-in-houston

అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాని స్థాపించామని అన్నారు.  ఇది మా చిరకాల కోరికని ఇంతకాలానికి కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్థానికంగా ఉన్న అలెన్ లో డాక్టర్ అబ్దుల్ రహమాన్ నివాసంలో దాదాపు 15 కుటుంభాలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి.

 

ఈ కార్యక్రమంలో ఏపీలో ఉన్న ముస్లిమ్స్ ప్రాముఖ్యతల గిరించి, వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలనే విషాయల గురించి చర్చించారు. భవిష్యత్తులో ఏపీలో, అమెరికాలో ఉంటున్న ముస్లిమ్ సోదరుల కుటుంబాలకి రక్షణగా ఉంటామని తెలిపారు


మరింత సమాచారం తెలుసుకోండి: