అమెరికాలో ఉంటున్న ఎంతో మంది తెలుగు ఎన్నారైలు తమ పిల్లలకి తెలుగు నేర్పించాలని ఆరాటపడుతూ ఉంటారు. తమలాగా తమ పిల్లలు కూడా తెలుగులో మాట్లాడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ పాశ్చాత్య సంస్కృతిలో అది సాధ్యమా అంటూ ఎంతో ఆందోళన కూడా చెందే వారు.కానీ ఎప్పుడైతే పాటశాల అమెరికాలో ఏర్పడిందో అప్పటి నుంచీ వారికి ఆ భయం పోయింది. అమెరికాలో తెలుగు బాష అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి అక్కడి తెలుగు ఎన్నారైల పిల్లలకి సులభంగా తెలుగు నేర్పించడానికి ఏర్పాటు చేయబడిన పాటశాల ఎట్టకేలకి ఆదిశగా  అడుగులు వేస్తూ మెల్లమెల్లగా విజయం సాదిస్తూ వస్తోంది.

 Image result for telugu patasala in us

ఎన్నారైల పిల్లలకి అత్యంత సులభంగా తెలుగు బాష అర్ధం అయ్యేలా ఏపీ ప్రభుత్వంతో కలిసి సులభ రీతిలో సిలబస్ రూపొందించిన పాటశాల గత ఐదేళ్లుగా అక్కడి పిల్లలకి తెలుగు నేర్పిస్తోంది. ఇదిలాఉంటే అమెరికాలోని బే ఏరియాలో నూతనంగా 2019 -20 సంవత్సరానికి గాను పాటశాల శాఖని ఏర్పాటు చేసింది. అంతేకాదు తాజాగా తెలుగు బాషా దినోత్సవం పురస్కరించుకుని వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.

 à°…మెరికాలో 'తెలుగు డే'

వారంలో ఒక రోజుని తెలుగు డే గా ప్రకటించాలని భావించింది. వారంలో ఒక రోజు పూర్తిగా తెలుగు మాట్లాడేలా తల్లి తండ్రులు పిల్లలల్ని ప్రోశ్చహించాలని తెలిపింది. అందుకుగాను గురువారం రోజుని తెలుగు రోజుగా పాటశాల ప్రకటించింది. ఆ రోజు పెద్దలు సైతం పిల్లలతో తెలుగులోనే మాట్లాడితే పిల్లలకి ఎంతో సులభంగా తెలుగు వస్తుందని తెలిపింది.ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: