పాకిస్తాన్ చెరలో ఉన్న కుల్ భూషణ్ జాదవ్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించిందని భారత్ ప్రకటించింది. తాజా పాకిస్థాన్ లోని భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ ఆహ్లూవాలియా జాదవ్ ను కలిశారు. ఆ తర్వాతే ఇండియా ఈ ప్రకటన విడుదల చేసింది.


ఆమోదయోగ్యం కాని తన వాదనను పాకిస్థాన్ ఆయనతో చెప్పినందువల్లే ఆయన టెన్షన్ పడినట్టు భారత్ అనుమానిస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం మేరకు జాదవ్ ను భారత రాయబార కార్యాలయ అధికారులు కలిసేందుకు పాకిస్థాన్ అనుమతి ఇచ్చింది.


సబ్ జైల్లో ఉన్న జాదవ్ ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లూవాలియా కుల్ భూషణ్ జాదవ్ తో దాదాపు అరగంట సేపు మాట్లాడారు. పాకిస్థాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ తో భారత్ దౌత్యపరంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇస్లామాబాద్ లోని ఓ సబ్ జైలులో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముందు పాక్ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధితో గౌరవ్ అహ్లువాలియా చర్చలు జరిపారు.


2016 మార్చి 3 నుంచి జాదవ్ పాక్ కస్టడీలో ఉండగా ఆయన్ని దౌత్యపరంగా కలిసేందుకు నిరాకరిస్తూ వచ్చిన పాక్ 2017ఏప్రిల్ లో గూఢచర్యం, ఉగ్రవాద అభియోగాలు మోపింది. జాదవ్ కు మరణదండన విధించింది. పాక్ సైనిక కోర్టు ఇచ్చిన తీర్పును అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేసిన భారత్ మరణ శిక్షను నిలుపుదల చేసేలా విజయం సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: