భారతీయులు ఎక్కడ ఉన్నా సరే అవసరమైనప్పుడు మనదైన సత్తా చూపించడంలో వెనకడుగు వేయరు. తమ ప్రతిభ ఆధారంగా అవకాశాలు వాటంత అవే వెతుక్కుంటూ వస్తాయి. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో అమెరికాలో ఋజువయ్యాయి. కేవలం ఒక్క అమెరికాలో మాత్రమే కాదు. భారతీయులు ఎక్కడ ఉన్నాసరే అక్కడి ప్రభుత్వం మన ప్రతిభకి పట్టం కట్టి తీరాల్సిందే. తాజాగా అమెరికాలో

 

భారత సంతతికి చెందిన అనురాగ్ సింఘాల్ వ్యక్తికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ జిల్లాకి జడ్జిగా నియమిస్తూ ట్రంప్ కీలక ఆదేశాలు జారీచేశారు. శ్వేత సౌధం కి వెళ్ళిన 17 న్యాయవాద నియామకాల్లో

సింఘాల్ పేరు కూడా ఉంది. ఫ్లోరిడా రాష్ట్రంలో దక్షిణాది జిల్లా జడ్జిగా ఉన్న జేమ్స్ ఐకోన్ స్థానంలో ఇప్పుడు సింఘాల్ జడ్జిగా వెళ్లనున్నారు.

 

ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ పదివిని చేపట్టనున్న మొట్ట మొదటి భారత సంతతి వ్యక్తి సింఘాల్ అని తెలుస్తోంది. సెనేట్ న్యాయ కమిటీక ఆయన నియామకాన్ని అధికారికంగా త్వరలో ఆమోదించనుంది. గతంలో సింఘాల్ ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీలో సర్క్యూట్ కోర్టు జడ్జిగా పని చేశారు. సింఘాల్ కి ఈ పదవి రావడంపై అమెరికాలోని ప్రవాస భారతీయులు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: