టైటిల్ చదివి షాక్ అయ్యారా మీరు చదివింది నిజమే, చదవబోయేది కూడా నిజమే. అసలు 5 ఏళ్ళ పిల్లాడు లైంఘిక వేధింపులు ఎలా చేశాడు. అప్పుడే A to Z నేర్చుకున్నాడా..?? అసలు ఏమిటి వివరం అనే వివరాలలోకి వెళ్తే. సోషల్ మీడియా సాక్షిగా ఈ బుడతడి వ్యవహారం వైరల్ అవుతోంది.  

 

అమెరికాలోని టెనస్సీ ప్రాంతానికి చెందిన రిడ్జ్ ఎలిమెంటరీ స్కూల్ లో చదువుతున్న ఐదేళ్ళ బాలుడు తోటి ఆడపిల్లలని ముద్దులు పెట్టుకుని, కౌగిలించు కుంటున్నాడంటూ స్కూలు యాజమాన్యం చైల్డ్ వెల్ఫేర్ వారికి  ఫిర్యాదు చేసింది. దాంతో ఒక్క సారిగా షాక్ అయిన ఆ పిల్లాడి బామ్మా స్కూల్ టీచర్స్ తీరుపై మండిపడుతోంది. అసలు ఐదేళ్ళ పిల్లాడు ఇలాంటి ప్రవర్తన ఎలా చేస్తాడని అనుకున్నారు అంటూ నిలదీసింది.

 

తన మనుమడు మూగవాడని తనకి ఎలాంటి వస్తవు కావాలన్నా, ఏమి చేయలన్నా సైగలతో చెప్తాడని ఆ క్రమంలోనే అలా జరిగి ఉంటుందని తెలిపింది. అంతేకాదు తన మనుమడికి జరిగిన అన్యాయంపై స్కూల్ టీచర్స్ కూడా యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వడంతో ఆమె ఎంతో బాధగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం పోస్ట్ చేసింది. దాంతో యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై  నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: