అమెరికా సంభంధం అంటే గతంలో తల్లి తండ్రులు ఎగిరి గంతేసే వారు. మా అమ్మాయికి విదేశాలకి వెళ్ళే అవకాశం వచ్చింది, సంతోషంగా ఉంటుంది అనుకుని అక్కడి సంభంధాల వైపే ఎక్కువగా మొగ్గు చూపేవారు. ఈ క్రమంలో అప్పట్లో అధికశాతం ఫారిన్ పెళ్లిళ్ళు చేసుకున్న వారి జీవితాలు సగంలోనే ముగిసిపోయేవి. భర్త , అత్తా మామ వేధింపులు తట్టుకోలేకో, అధిక కట్నం కోసం భర్త టార్చర్ పెట్టడమో ఎదో ఒక కారణంతో వారి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయేవి. దాంతో

 

అమెరికా పెళ్లి సంభంధం అంటే ఆడపిల్లలని ఇవ్వడం మానేశారు ఫారిన్ సంభంధం అంటే భయపడిపోయే వారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు కూడా ఎక్కడా జరగలేదు కూడా. అయితే మళ్ళీ ఈ సంస్కృతికి తెర తీశారా అనేట్టుగా తాజాగా అమెరికాలో మరో ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని నార్త్ కరోలినా లో ఉంటున్న మీ అమ్మాయి ఆత్మ హత్య చేసుకుంది అంటూ హైదరాబాద్ లో ఉంటున్న అమ్మాయి తల్లి తండ్రులకి ఫోన్ వచ్చింది.

 

ఈ ఘటనతో ఒక్క సారిగా షాక్ తిన్న మహిళ తల్లి తండ్రులు తమ కూతురి భర్త అత్త మామ పెట్టే వేధింపుల వలనే తమ కూతురు చనిపోయిందని కన్నీరు మున్నీరు అవుతున్నారు. కొంత కాలంగా తమ వద్ద ఉన్న తమ కూతురు వనిత రెండు నెలల క్రితమే అమెరికా వెళ్లిందని అప్పటి నుంచీ మాకు ఫోన్ లో అందుబాటులో లేదని తెలిపారు తల్లి తండ్రులు. అయితే ఆమె ఆత్మ హత్య చేసుకుందని భర్త తరుపు భంధువులు చెప్పగా. ఆమె ముఖంపై  దిండు అదిమి హత్య చేశారని అక్కడ ఉన్న మహిళ భంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని పోలీసులు వనిత భర్తని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 




మరింత సమాచారం తెలుసుకోండి: