భార్యని చంపేసి ఏమి తెలియనట్టుగా అమెరికా నుంచీ భారత్ వచ్చేసిన ఓ ఎన్నారై ని అమెరికా కోర్టు సుదీర్ఘ కాల విచారణ తరువాత దోషిగా తేల్చింది. చట్టప్రకారం విడిపోయినా అతడికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, క్షణికావేశంలో తప్పులు చేస్తే ఇటువంటి పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ  2007 లో జరిగిన ఈ సంఘటనకి సంభందించిన కేసుకు సంభందించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివరాలలోకి వెళ్తే..

 Image result for america court indian nri

అవతార్ గ్రేవాల్ అనే భారత ఎన్నారైకి 2005 లో నవనీత్ కౌర్ తో వివాహం అయ్యింది. ఆమె కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అయితే భర్త ఉద్యోగ రీత్యా కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్యపై భర్తకి అనుమానం రావడం మొదలయ్యింది. తాను ఫోన్ చేస్తున్న సమయంలో వెయిటింగ్ అని రావడం, భార్య పై అనుమానం వచ్చిన ప్రతీ సారి ఫోన్ చేసి మాట్లాడటం, ఫోన్ గనుకా ఎత్తక పొతే ఆమె ఆఫీసు లో ఆరా తీయడం మొదలు పెట్టాడు.

 Related image

అవతార్ ప్రవర్తనతో విసుగు చెందిన ఆమె ఫోన్ లోనే భర్త నుంచీ విడాకులు కోరింది. అమెరికా వచ్చిన అవతార్ ఇంటికి వెళ్ళగానే ఇద్దరి మధ్య గర్షణ జరగింది. ఈ గొడవలో తీవ్ర కోపానికి లోనయిన అవతార్ ఆమె గొంతు నులిమి, బాత్ టబ్ లో ముఖాన్ని ముంచి చంపేశాడు. అనంతరం ఇండియా కి వెళ్ళిపోయాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు అవతార్ ని అప్పగించాల్సిందిగా భారత పోలీసులని కోరడంతో 2011 లో అమెరికాకి అప్పగించారు. దాంతో 12 ఏళ్ళ తరువాత స్థానిక కోర్టు ఈ కేసులో అవతార్ ని దోషిగా తేల్చింది. త్వరలో శిక్షని ఖరారు చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: