అక్రమంగా డబ్బు సంపాదించాలన ఆలోచనతో ఎదుటి వారి ప్రాణాలతో చలగాటమాడుతున్నారు మద్యం మాఫియా..కల్తీ మద్యం పై తెలుగు రాష్ట్రాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారి దందా వారేదే అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మడం అమాయకుల ప్రాణాలు తీయడం వారికి అలవాటైంది. నిన్న విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో కల్తీ మద్యం సేవించి ఎనిదిమంది మృతిచెందిన ఘటనలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ ఘటనలో ఇప్పటి వరకు 9మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో.. కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా మల్లాది విష్ణుపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసివేయాలని ఎక్సైజ్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కల్తీ మద్యం సేవించి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ డీజిపి జేవీ రాముడు మంగళవారం నాడు పరామర్శించారు. డిజిపి... హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ పివి రమణమూర్తితో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నిన్నటి ఘటనపై విచారిస్తున్నామన్నారు. ఈ కేసులో దోషులుగా తేలితే ఎవరినైనా విడిచిపెట్టేది లేదని చెప్పారు.. కల్తీ మద్యం ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆ బార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందినది. బార్ లైసెన్స్ ఆయన పేరిట లేకున్నా, స్వయానా ఆయన తల్లికి యాజమాన్యంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో విష్ణు పేరు కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: