గత నెలలో విజయవాడ కృష్ణలంకలో గల స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మరణించగా మరి కొందరు ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. ఈ విషయంపై ప్రతి పక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేఖత చూపించింది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు కేసును సీరియస్ గా తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆర్డర్ వేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బార్ అణువణువు గాలించి మద్యం సీసాలను, గ్లాసులను సీజ్ చేసి ల్యాబ్ కి పంపించారు.

ఆ మద్య ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపింది. అయితే ఈ బార్ లో రాజకీయ నాయకులు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలడం జరగింది. అందులో  కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణు కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన అరెస్టు ఖాయమని వార్తలు గుప్పుమన్నాయి.  అప్పటి నుంచి మల్లాది అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎట్టకేలకు మల్లాది విష్ణు అజ్ఞాతం వీడి విజయవాడలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

మద్యం భాదితులను పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు


రేపు మీడియా ఎదుట అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.తాజాగా అజ్ఞాతం వీడిన ఆయన తాను పరారీలో ఉన్నది అవాస్తవం అని చెప్పారు. కొన్ని కార్యక్రమాల దృష్ట్యా తాను వెళ్లాను తప్ప ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. మద్యం కేసులో తనకు నోటీసులు అందాయని చెప్పిన ఆయన ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రేపు కోర్టు విచారణకు హాజరవుతానని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: