ఆంధ్రప్రదేశ్ లో ని విజయవాడలో కల్తీ మద్యం సేవించి కొందరు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ ప్రభుత్వం తీసుకుంది..అంతే కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించి నేరస్తులు ఎంతటి వారైనా శిక్షిస్తామన్నారు.  కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

గత కొంత కాలంగా మల్లాది అజ్ఞాతంలోకి వెళ్లి ఆ మద్య తిరిగి ప్రత్యక్షమయ్యారు..తను కోర్టుకు పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పారు.  మాజీ ఎమ్మెల్యే విష్ణుపై పొలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏ9గా ఆయన పేరు చేర్చారు. ఏ4గా విష్ణు తల్లి మల్లాది బాల త్రిపుర సుందరమ్మని చేర్చారు. విష్ణు సోదరులు, బావమరిది 20 యేళ్ళుగా క్రిష్ణలంకలో స్వర్ణ బార్ నిర్వహిస్తున్నారు. తాజాగా మల్లాది విష్ణుకు శుక్రవారం నాడు బెయిల్ మంజూరయింది. కల్తీ మద్యం కేసులో ఇటీవల అరెస్టైన అతనికి బెయిల్ వచ్చింది. విష్ణుతో పాటు సోదరుడు మల్లాది శ్రీనివాస రావుకు కూడా కోర్టు బెయిలు వచ్చింది.

రూ.50వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులతో విజయవాడలోని మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ సెషన్స్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. వారానికి మూడు రోజులు పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని, సిట్ విచారణకు సహకరించాలని కోర్టు షరతులు విధించింది. కాగా, కల్తీ మద్యం కేసులో పోలీసులు కాంగ్రెసు పార్టీ నాయకుడు మల్లాది విష్ణును పదిహేను రోజుల క్రితం అరెస్టు చేశారు.

అనుచరులతో బయటకు వస్తున్న మల్లాది విష్ణు


ఈ కేసులో రెండు రోజుల పాటు విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు చివరకు అరెస్టు చేసింది. మల్లాది విష్ణుకు సంబంధం ఉన్నా బార్ లో  ఒరిజినల్ చాయిస్ అనే చీప్ లిక్కర్లో  కల్తీ జరగడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మంది అస్వస్థత పాలయ్యారు. వారు ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: