ఒంటరిగా పోటీ చేయడం కంటే పొత్తులో పోటీ చేయడమే మేలని అనుకుంటున్నాయో ఏమో రాజకీయ పార్టీలు, అందుకే పొత్తులతో పోటీకి సై అంటూ కోతతరం రాజకీయ అంకానికి తెర లేపుతున్నాయి పార్టీలు. మినీ సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ఎత్తుల పొత్తుల వ్యుహల్లో మునిగిపోయాయి. తమిళనాట ప్రస్తుతం అధికారంలో ఉన్న జయమ్మకు చెక్ పెట్టడానికి ప్రతిపక్షాలు పెద్ద వ్యుహాలనే పన్నుతున్నాయి.

 

ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోడానికి తహతహలాడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఇందులో భాగంగా ఒంటరిగా భరిలోకి దిగబోతున్న కెప్టెన్ కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన  కరుణానిధి ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

 

ఏఐసీసీ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం ఉదయం చెన్నైలో డీఎంకే చీఫ్‌ కరుణానిది నివాసానికి వెళ్లి సీట్ల పంపకాల విషయంపై చర్చించారు. సీట్ల విషయంలో కాంగ్రెస్ ఓ మెట్టు దిగగా, డీఎంకే బెట్టుసడలించింది. దీంతో కరుణతో ఆజాద్ చర్చలు ఫలించాయి. ఈ సమావేశంలో కరుణ కుమారుడు స్టాలిన్, తనయ కనిమొళి ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. తమిళనాడు ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, డీఎంకే కూటమి, డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్ కాంత్ సారథ్యంలోని పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పోటీ చేస్తున్నాయి. మరి ఈ పుత్తు ఫలించి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయా అంటే మాత్రం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. అయినా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చెప్పడం చాలా కష్టమైనా విషయం. మరి ఫలితాలు మాత్రం ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలంటే ఎన్నికలు ముగిసేవరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: