భాగ్యనగరంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పిల్లలు, పెద్దలు జ్వరాల బారిన పడుతున్నారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఆస్పత్రుల్లో ఔట్ పేషంట్ విభాగాలతో పాటు ఇన్ పేషంట్ గా చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

ఫీవర్ ఆస్పత్రిలో సుమారు పదిహేను రోజులుగా జ్వరాల బాధితుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం పన్నెండు లోపు ఓపీలో నమోదు చేసుకున్న వారినే వైద్యులు పరీక్షిస్తున్నారు. వారం రోజులుగా రోజుకు సుమారు వెయ్యి మంది ఔట్ పేషంట్ లుగా చికిత్స పొందుతున్నారు. ప్రతీ రోజు సరాసరిగా 50 మంది వరకు ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్నారు.


వైరల్ జ్వరాలు ఎక్కువ మందిని పట్టి పీడిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా  కేసులు కూడా నమోదవుతున్నాయి. ఫీవర్ ఆస్పత్రిలో జూన్, జులైలో 903 మంది వైరల్ ఫీవర్ తో చికిత్స పొందారు. టైఫాయిడ్ తీవ్రత కూడా ఎక్కువే ఉంది. ఫీవర్ ఆస్పత్రి సుమారు 45 రోజుల్లో 70 మంది టైఫాయిడ్ చికిత్స తీసుకున్నారు. ఇంకా ఉస్మానియా, గాందీ ఆస్పత్రుల్లోనూ పరిస్తితి ఇదే విదంగా ఉంది. నగరంలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్ లలోనూ పెద్ద సంఖ్యలో జ్వరాలతో చేరుతున్నారు.

వర్షాకాలంలో వచ్చే మార్పులతో పాటు మురికివాడల్లోని అపరిశుభ్ర వాతావరణం జ్వరాలు, వ్యాధులకు కారణమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అడపాదడపా వర్షాలు కురవడంతో.. సరైన డ్రైనేజీ వ్వవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ లేని చోట దోమలు, ఈగలు విజృంబిస్తున్నాయి. దోమల కారణంగా డెంగీ, మలేరియా, టైపాయిడ్ వంటి జ్వరాలు విస్తరిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: