తెలుగు రాష్ట్రాలు గర్వించే విధంగా షటిల్ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధూ రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించిన దేశం పరువు కాపాడింది. అంతకు ముందు హర్యానకు చెందిన  సాక్షి మాలిక్ రెజ్లింగ్ లో కాంస్య పతకం సాధించింది. ఇలా ఇద్దరు అమ్మాయిలే భారతీయుల కలలు నెరవేర్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం సిందూ, సాక్షికి బహుమతి ప్రకటించింది. సిందూకు రెండు కోట్ల రూపాయల అవార్డును, రెజిలింగ్ లో కాంస్య పతకం సాదించిన సాక్షి మాలిక్ కు కోటి రూపాయలు ఇవ్వాలని కూడా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సింధూకి కోటి రూపాయలు బహుమతి ప్రకటించింది.  ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింధూకి ఏకంగా మూడు కోట్లు బహుబతి ప్రకటించింది.  అంతే కాదు  ముఖ్యమంత్రి చంద్రబాబు   అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సింధూకి గ్రూప్ ఒన్ సర్వీస్ ఉద్యోగం ఇవ్వాలని, అమరావతిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వాలని , ఆమెను ప్రభుత్వ పక్షాన సత్కరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.  ఈ సందర్భంగా సింధూ స్పందిస్తూ..ఒలింపిక్స్ లో రజత పతకం సాదించాడానికి ప్రదాన కారణం తన కోచ్ పుల్లెల గోపీ చంద్ అని ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు చెప్పారు.

తాను గెలుచుకున్న వెండి పతకాన్ని కోచ్ కు ,తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నానని ఆమె చెప్పారు. మొత్తంగా చూస్తే చాలా మంచి గేమ్ ఆడాం అని అంటూ ,తనకు సిల్వర్ మెడల్ దక్కినా సంతోషంగానే ఉందన్నారు.తనకు మద్దతు తెలిపి, విజయం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు.కోచ్ గోపీచంద్ తనతో సమానంగా శ్రమించారని ఆమె తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: