ఇప్పుడు ప్రపంచం అంతా భారత దేశంలోని ఇద్దరు అమ్మాయిలపైనే చర్చలు నడుస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. అమ్మాయిలు మగవారికి ఏమాత్రం తీసిపోరు అంటూ చాటి చెప్పిన పివి సింధూ, సాక్షి మాలిక్ ఇప్పుడు యావత్ భారత దేశంలో టాక్ ఆఫ్ ది సెలబ్రెటీలుగా మారిపోయారు.  కృషీ పట్టుదల ముందు విజయం తల వంచక తప్పలేదు..బంగారు పతకమే కాదు అసలు అక్కడి వరకు వెళ్లి ఆడటమే గ్రేట్ అనుకున్న సమయంలో సాక్షి కాంస్య పతకం, సిందూ వెండి పతకాన్ని గెల్చుకుంది. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మూడు కోట్లు, తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు బహుమతి ప్రకటించడమే కాకుండా ఢిల్లీ ప్రభుత్వం సింధూకి రెండు కోట్లు బహుమతి ప్రకటించింది.

తాజాగా సింధూ గెలుపుపై ఎంతో సంతోషించి ప్రముఖ సినీ నటులు, వైసీపీ నేత విజయ్ చందర్ తన ఉదారతను చాటుకున్నారు.  భారత దేశం గర్వించ దగ్గ అమ్మాయి సింధూ అని ఒలింపిక్స్ లో వెండి మెడల్ ను సాదించిన పివి సింధూ కు తన ఆస్థిలో రెండు ఎకరాల భూమిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.సిందు తన మనుమరాలితో సమానమని,ఆమె అద్బుతమైన ప్రతిభ ప్రదర్శించి ఓలింపిక్ లో మెడల్ తీసుకువచ్చి,దేశానికి ఎంతో గౌరవం తెచ్చింది తెలుగు అమ్మాయి కావడం తలెత్తుకునే విషయం అని అన్నారు.

అమ్మాయిలు ఈ మద్య అన్నింటా ముందు ఉంటున్నారని వారిని ప్రోత్సహించాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.  పార్టీ అదినేత జగన్ చేతుల మీదుగా ఈ భూమి పత్రాలను సింధుకు అందచేస్తామని విజయ్ చందర్ ప్రకటించారు.కరుణామయుడు ట్రస్టు ద్వారా ఈ భూమి అందచేస్తున్నామని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: