ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో వర్షం విపరీతంగా కురిసింది. అయితే వర్షాలు కురిస్తే ఓ పక్క ఆనందించాల్సి విషయమే కానీ మరోపక్క ఎంతో జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరద నీటి వల్ల తాగు నీరు కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయని, ఫలితంగా వాంతులు, విరేచనాలు, వైరల్ ఫీవర్ తదితర వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రస్తుతం వర్షాలతో కొత్త నీరు రావడం, కొన్ని చోట్ల నిలువ ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, పారిశుధ్యం తదితర కారణాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అలాగే ఆహారం, మంచి నీరు, దోమలు, ఈగల వల్ల కూడా అనేక వ్యాధులు విజృంభిస్తున్నాయి.
Image result for Seasonal Diseases
అంటువ్యాధులు ప్రబలకుండా సత్వర వైద్య సేవలను అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. యూపీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులతో పాటు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తదితర ఆసుపత్రుల్లో సైతం సీజనల్ వ్యాధులకు సంబంధించి ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.  ఇక వర్షాల కారణంగా కొన్ని స్లమ్ ఏరియాల్లో విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. వర్షాలు వచ్చిన తర్వాత అక్కడ చేరిన బురుద నీటితో నానా ఇబ్బందులు పడుతున్నారు.
Image result for heavy rain hyderabad
ఇదే సమయంలో అంటు వ్యాధులు కూడా ప్రభలే అవకాశాలు కూడా ఉన్నాయి.  అంతే కాదు ఆహారం పరిశుభ్రత లోపిస్తే అతిసార, జాండీస్, టైఫాయిడ్‌, మంచినీరు, పరిశుభ్రత లోపిస్తే అతిసార, కలరా, టైఫాయిడ్‌, దోమ కాటుతో మలేరియా, డెంగ్యూ, ఈగలతో టైఫాయిడ్‌, ఇతర అంటువ్యాధులు, అనూహ్యంగా స్వైన్‌ఫ్లూ వంటి భయంకర వ్యాధులు పేషెంట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Image result for heavy rain  slam areas

వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి :

Image result for health problems slum areas

దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి విముక్తి పొందవచ్చు. పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించాలి. అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి.పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేటట్లు దుస్తులు వేయాలి. సొంత చికిత్స చేయకూడదు.

Image result for Seasonal Diseases


మరింత సమాచారం తెలుసుకోండి: