ఈ మద్య డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకున్నారు చాలా మంది.  అయితే ఈ డబ్బు సంపాదించే క్రమంలో ఎదుటి వారి ప్రాణాలు హరించినా తమకు ఏమీ పట్టనట్టు ఉంటున్నారు బడాబాబులు.  సొసైటీలో  పెద్ద పేరు ఉన్నా..వారు చేసే అక్రమ వ్యాపారాల వల్ల ఎంతో మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  ముఖ్యంగా మద్యం దందాల్లో చాలా మంది పెద్దలు అక్రమార్జన చేస్తూ  కోట్లకు పడగ ఎత్తుతున్నారు. ఈ మద్య దందాలో రాజకీయ హస్తాలు కూడా చాలా ఉన్నాయని వార్తల్లో చుదువుతూనే ఉన్నాం.   
Image result for విజయవాడ స్వర్ణ బార్‌
ఆ మద్య విజయవాడ స్వర్ణబార్ లో 2015 లో చోటుచేసుకొన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.  మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా  ఈ బార్ లో ఉపయోగించిన కూలర్ నీటిలో సైనైడ్ కలిపారని సిట్ గుర్తించింది. ఈ బార్ కృష్ణలంకలోని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బంధువులకు చెందింది. ఈ ఘటన పెద్ద ఎత్తున దుమారం రేపడంతో చర్చనీయాంశమైంది. రాష్ట్ర డీజీపీ స్వయంగా ఘటనా స్ధలికి వెళ్లి పరిశీలించి విచారణకు ఆదేశించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది.
Image result for విజయవాడ స్వర్ణ బార్‌
అయితే స్వర్ణ బార్ లోని కూలర్ నీటిలో సైనైడ్ కలిపినట్టు సిట్ నిర్ధారించింది. అయితే సైనైడ్ ను ఎవరైనా కలిపారా లేదా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా మద్యం తాగి ఐదుగురు ప్రాణాలు పోవడంపై ప్రతిపక్షం పెద్ద ఎత్తున్న ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దోషులు ఎవ్వరిని వదలబోమని ప్రకటించింది.  ఘటనకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. 

Image result for విజయవాడ స్వర్ణ బార్‌


మరింత సమాచారం తెలుసుకోండి: