నిజం నిద్రలేచే లోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుంది. అందుకే నిజం నిలకడమీద తెలుస్తుందని అంటారు పెద్దలు. ఒక్కొసారి నిజం తొట్రుపాటు పడుతుంది అబద్ధం బలంగా కనిపిస్తుంది. అలాంటిదే 2 జి స్కాం కేసు. ఒక్కసారి తడబడింది. విజయం నేఱాభియోగం మోపబడ్డ కాంగ్రెస్ డిఎంకె తాత్కాలికంగా వరించిందంటున్నారు. ఆమాత్రానికే పండగ చేసుకుంటు న్నాయి కాంగ్రెస్ డిఎంకె తోడుదొంగలు అని సుబ్రమణ్యస్వామి.
Image result for subramanya swamy bjp
2జీ స్కామ్ లో ప్రధాన నిందితులందరినీ టోకుగా నిర్దోషులుగా ప్రకటిస్తూ, పాటియాలా భవన్ సీబీఐ న్యాయస్థానం తీర్పుపై స్పందించారు ఈ కేసు విచారణలో అత్యంత కీలకమైన వ్యక్తి భారతీయ జనతా పార్టీ పార్ల్మెంట్ సభ్యుడు సుబ్రమణ్యస్వామి. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదిక (కాగ్ రిపోర్ట్) సమర్పించిన తర్వాత, స్వామి దాఖలు చేసిన దరకాస్తు పై న్యాయస్థానం స్పందించడంతో 2జీ స్కామ్ పై విచారణ మొదలైంది.
Image result for paTiala bhavan cbi court
ఈ కేసులో పై సీబీఐ విచారణ మొదలైన కొత్తలో ప్రధాన వ్యాజ్య ప్రముఖుడు (లిటిగెంట్)గా సుబ్రమణ్యస్వామి ఒక వెలుగు వెలిగారు అంతులేని ప్రచారం కూడా పొందారు. ఈ స్కామ్ లో యుపిఏ ప్రభుత్వం లో టెలికం మంత్రిగా ఉన్న మిత్ర పక్ష భాగస్వామ్య పార్టీ డిఎంకె రాజా, కరుణానిధి ప్రియ తనయ ఎంపి కనిమొళి పాత్రలపై స్వామి గట్టి ఆరోపణలు చేశారు కూడా.
Related image
అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా కోర్టు తీర్పు తో రాజా, కనిమొళిలు ఒక్కసారిగా నిర్దోషులుగా బయటకు వచ్చారు. ఈ నేపథ్యం లో సుబ్రహ్మన్య స్వామి స్పందిస్తూ, అప్పుడే "ఈ కేసు కథ ముగిసిపోలేదు-ముందుంది ముసళ్ళ పండగ" అని అంటున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వెళితే అక్కడ తీర్పు తారుమారు అవుతుంది అని స్వామి అభిప్రాయపడ్డారు. ఈ కేసు తీర్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.
Image result for paTiala bhavan cbi court with kanimoli raja

ఇంతకు ముందు కూడా పలు కేసుల్లో కోర్టు మారినప్పుడు తీర్పు మారిపోయిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. డీఎంకే వాళ్లు అప్పుడే సంబరాలు చేసుకోకూడదని, పై కోర్టు లో తీర్పు మారడం ఖాయం, డీఎంకే ముఖ్య నేతలు ఈ కేసులో దోషులుగా తేలడం ఖాయం అని స్వామి అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా క్రింది న్యాయస్థానంలో పరమ పవిత్రలు, అగ్ని పునీత లు గా క్రింది కోర్ట్ తీర్పుతో బయటకు వచ్చిన జయలలిత - శశికళ బృందం అక్రమాస్తులకేసు సుప్రీం కోర్టు లో దోషులుగా తేలటంతో జయలలిత మరణించగా శశికళ బృందం జైళ్ళలో మగ్గుతున్నారు. అదే పరిస్థితి రాజా-కనిమోళికి తప్పదని న్యాయవాదులనేకులు అంటున్నారు.
Image result for subramanya swamy bjp chidambaram congress kapil sibal
గుజరాత్ ఎన్నికల్లో కొంత అనుకూల ఫలితాలతో ఉతాహంతో గంతులేస్తున్న కాంగ్రెస్ కు  ఇప్పుడు 2జీ స్కామ్ లో సీబీఐ కోర్టు తీర్పు తో కాంగ్రెస్ ఆనంద పరవశం ఓలలాడిస్తుంది. 2జీ స్కామ్ తో కాంగ్రెస్ పార్టీ పరువు, పదవిని పోగొట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అత్యంత విధారక ఓటమిని మూటగట్టుకోవడానికి కారణాల్లో ఒకటి 2జీ స్కామ్. ఈ స్కామ్ లో 1.76లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని నాటి కాగ్ వ్యాఖ్యలకు నివేదికకు మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగడం ఆ కేసును సుప్రీం కోర్ట్ కూడా సీరియస్ గా తీసుకోవటం తో సీబీఐ కూడా బలమైన అభియోగాలు మోపి విచారణ చేపట్టటంతో కాంగ్రెస్ కావలసిన దానికంటే ఎక్కువే అప్రతిష్ఠ వచ్చింది.

Related image


కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ స్కాం అభియోగాలు, విచారణలు ఇతరత్రా కీలక పరిణామాలన్నీ, చార్జ్ షీట్ సమర్పణతో సహా వారి హయాం లోనే జరిగిపోయాయి.  కేంద్రంలో యూపీఏ సర్కారు ఉండగానే, ఈ స్కామ్ పై విచారణ మొదలైంది. డీఎంకే ఎంపీ రాజా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది, జైల్లో 15 నెలలు గడపాల్సి వచ్చింది. ఇక కనిమొళి కూడా ఆరు నెలల పాటు తీహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరకి ఎలాగోలా బెయిల్ మీద ఇద్దరూ బయటపడ్డారు.
Image result for subramanya swamy bjp chidambaram congress kapil sibal
మరోవైపు సీబీఐ, ఈడీలు 2జీ పై విచారణను కొనసాగించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తన తుది తీర్పును ఇచ్చింది. ఈ తీర్పుతో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు డీఎంకేలు సంతోషంగా ఉన్నాయి. తమ హయాంలో అవినీతి జరిగిందనేది కేవలం అభి యోగం, దుష్ప్రచారం మాత్రమే, అందుకు సీబీఐ కోర్టు తీర్పే రుజువు అని కాంగ్రెస్ వాళ్లు ఈ తీర్పును అద్భుతంగా వాడేసు కుంటున్నారు. డీఎంకే అయితే పండగే చేసుకుంటోంది. అటు కరుణానిధి కూతురు నిరపరాధిగా తేలడం, ఇటు పార్టీపై అవినీతి మరకలు దీంతో సమయానికి తగినట్లు ఎంతో కొంత తగ్గుముఖం పట్టడం, డీఎంకే వర్గాలు  ఆనందడోలికల్లో ఉయ్యాల లూగుతున్నాయి. 

Image result for vinod rai bcci

అయితే సంబరాలు చేసుకుంటున్న ఈ పార్టీలకు "ఉన్నత న్యాయస్థానాల టెన్షన్" కూడా కొంత బ్రేకులు వేస్తుంది. సిబీఐ కోర్టు తీర్పుపై ప్రభుత్వం హైకోర్టుకు వెళితే తీర్పు తిరగబడుతుందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అయితే, అక్కడ కూడా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని కనిమొళి వ్యాఖ్యానించారు. ఇంతకాలం విచారణ చేసి అభియోగాలు మోపి ఇంత మందిని విచారించిన ఈ కేసులో ఏమీ ఈ దోషులు నిర్దోషులంటే భారదేశ జనవాహిని ఆసేతుసీతాచలం నమ్మేలా లేరు. మన్మోహన్ సింగ్ చెప్పినా, రాహుల్ గాంధి చెప్పినా కాంగ్రెస్ డిఎంకే ల సత్యసంధత పై ప్రజల అనుమానం ఏమాత్రం సడలట్లేదు.

Image result for kapil sibal on 2g case judgement

కోర్ట్ తీర్పుపై కూడా అనుమానాలు పోడచూపుతున్నాయి. సీబీఐ విచారణలో దోషముందని జనం సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. న్యాయస్థానం కూడా నేఱం జరగలేదని నిర్ధారించలేదు సరికదా!  సీబీఐ విచారణనే నిందించింది. క్షణకాలం నిజం తడబడింది అందుకే ముందుంది ముసళ్ళ పండగ అన్నారు. 

Image result for paTiala bhavan cbi court

మరింత సమాచారం తెలుసుకోండి: