ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉంటుందనే దానిపై చర్చోపచర్చలు జరిగాయి. ఏపీకి తరలిపోతుందని చాలా విశ్లేషణలు వచ్చాయి. అనేక మంది సినీ ప్రముఖులు విశాఖలో స్టూడియోలు కట్టేందుకు స్థలాలు కూడా కొనుగోలు చేశారన్న ప్రచారమూ జరిగింది. అయితే టాలీవుడ్ పెద్దలు ఎప్పుడూ చిత్ర పరిశ్రమ తరలిపోతుందనే ప్రకటనలు చేయలేదు. పైగా హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ పాతుకుపోయిందని, తరలిపోవడమనేది సాధ్యం కాదని స్పష్టం చేశారు కూడా.
Image result for అమరావతి సినిమా పరిశ్రమ
ఒకప్పుడు మద్రాస్ నుంచి తెలుగు పరిశ్రమను హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు ప్రముఖ నటులు నాగేశ్వరరావు, కృష్ణ, దర్శకులు దాసరి నారాయణ రావు ఇలా ఎంతో మంది కృషి చేశారు.  అయితే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ నెలకొల్పేందుకు మళ్లీ సన్నాహాలు మొదలు పెట్టారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉంటుందనే దానిపై చర్చోపచర్చలు జరిగాయి. ఏపీకి తరలిపోతుందని చాలా విశ్లేషణలు వచ్చాయి. అనేక మంది సినీ ప్రముఖులు విశాఖలో స్టూడియోలు కట్టేందుకు స్థలాలు కూడా కొనుగోలు చేశారన్న ప్రచారమూ జరిగింది.
Amaravathi
అయితే టాలీవుడ్ పెద్దలు ఎప్పుడూ చిత్ర పరిశ్రమ తరలిపోతుందనే ప్రకటనలు చేయలేదు. పైగా హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ పాతుకుపోయిందని, తరలిపోవడమనేది సాధ్యం కాదని స్పష్టం చేశారు కూడా. ఇప్పటికే అమరావతి చుట్టుపక్కల కొన్ని సినిమాలు షూటింగులు జరుపుకున్నాయి. తాజాగా 1960 ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగిన యదార్థ కధ అధారంగా శ్రావణ్ రాజ్ ఇన్నోవేషన్ నిర్మాణ సారధ్యంలో మన ఊరు నాప్రేమ పేరుతో కుటుంబ ప్రేమకధ చిత్రం తెరకెక్కుతుంది.
Image result for amaravathi shooting
గోపికృష్ణ, ప్రియాంక హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ పూర్తిగ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకుంటోంది.సెంథిల్ కుమార్ వద్ద సహాయకుడిగా పలు సినిమాలు కార్తిక్ ఈ సినిమాకి పూర్తిస్ధాయి కెమెరామెన్ వ్యవహారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా నిర్మాణాలకు రాయితీలు కల్పించటం, గ్రామస్తులు సహాకారంతో తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేస్తున్నామని సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. సినిమా షూటింగ్ కార్యక్రమాలు కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం అత్కూరులో శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Image result for amaravathi movie shooting
మొదట రాజమండ్రి, విశాఖ, వరంగల్, హైదరాబాద్ షూటింగ్ చేద్దామని అనుకున్నారట. ఉంగుటూరు మండలం అత్కూరు, చుట్టుపక్కల గ్రామాలు అనువుగా ఉండటంతో సినిమా మొత్తం ఇక్కడే నిర్మాణం చేస్తున్నామని డైరెక్టర్, నిర్మాత శ్రావణ్ రాజ్ చెబుతున్నారు.ఇప్పటికే అమరావతి నిర్మాణంలో భాగంగా మీడియా నగరాన్ని ముఖ్యమంత్రి డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. అది కూడా రూపుదిద్దుకుంటే ఇక అమరావతిలో సినిమా సందడి మరింత జోరుందుకుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: