హిందూపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ కు పరిస్థితులు అనుకూలంగా మారలేదు. తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ అడ్డదారుల్లో ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే తన వీఆర్‌ఎస్‌ ఆమోదించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని, లేని కేసులు ఉన్నట్లు చూపించి పెండింగ్‌ పెట్టారని.. దీనిపై ట్రిబ్యునల్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని మాధవ్‌ ఎన్నికల అధికారికి వివరించారు.  


తన వీఆర్‌ఎస్‌ ఆమోదం విషయంలో స్వయానా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాజాగా  గోరంట్ల మాధవ్  తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.  నామినేషన్లకు తుది గడువు ముంచుకొస్తుండటంతో... తన భార్య సవితను రంగంలోకి దించాలని భావించారు. సోమవారంతో నామినేషన్ గడువు ముగుస్తుండటంతో వైసీపీ ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. గోరంట్ల మాధవ్ భార్య సవితను బరిలోకి దింపాలని భావిస్తోందట. మాధవ్‌ను రిలీవ్ చేయకపోతే సోమవారం సవితతో నామినేషన్ వేయించాలని భావిస్తున్నారట.


శని, ఆదివారం సెలవులు కావడంతో కోర్టును ఆశ్రయించడంపైనా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం పార్టీ అధినేత జగన్ తో మాధవ్ భేటీ అయ్యారు. తన రాజీనామాను ఆమోదించకపోతే తన భార్యతో నామినేషన్ వేయిస్తానని ఈ సందర్భంగా జగన్ కు చెప్పారు. దీంతో, మాధవ్ భార్య సవితకు బీఫామ్ ఇవ్వాలంటూ పార్టీ నేతలను జగన్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: