సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఆయనకు డబుల్ ప్రమోషన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడీ అయ్యారని టాక్. మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి టఫ్ ఫైట్ లో కూడా గెలిచారు. ఆయన ఓడించింది కూడా ఎవరినో కాదు,  టీడీపీ తరఫున నిలబడి  అప్పట్లో ప్రతీ రోజూ జగన్ని, వైసీపీని టార్గెట్ చేసే బొండా ఉమను.  దాంతో జగన్ కి విష్ణు బాగా ఆప్తుడు అయ్యారు. అంతే కాదు, ఆయన తండ్రి వైఎస్సార్ కాలం నుంచి కూడా విష్ణు వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. దీంతో ఇపుడు వైసీపీ సర్కార్లో విష్ణు  పరపతి బాగా పెరిగింది.


రాజధానీ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కావడం, నోరున్న నేత కావడంతో జగన్ సైతన్ ఆయన్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన విష్ణుని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా తీసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు రేపో మాపో ఉత్తర్వులు వెలువడతాయని అంటున్నారు. అంతే కాకుండా విష్ణుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా కూడా జగన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 


ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా విష్ణుకు ఇపుడు రెండు పదవులు ఒకేమారు రావడం పట్ల బ్రాహ్మణ సామాజికవర్గం ఆందందంగా ఉంది విష్ణు నాయకత్వంలో బ్రాహ్మణ కార్పోరేషన్ కొత్త పుంతలు తొక్కుతుందని అంటున్నారు.  అదే విధంగా ఆయన సేవలు ఇటు ప్రభుత్వానికి కూడా బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. మంత్రి పదవి రేసులో ఉన్న విష్ణుకు ఇపుడు రెండు పదవులు ఒకేసారి రావడం తో జాక్ పాట్ కొట్టారని అంటున్నారు.  మరి డబుల్ పదవుల్లో విష్ణు ఎలా రఫ్ఫాడించేస్తారో చూడాలి అంటున్నారు ఆయన ఫ్యాన్స్



మరింత సమాచారం తెలుసుకోండి: